ఏపీకి తీపికబురు.. విశాఖపట్నం రైల్వే జోన్ పై కేంద్రమంత్రి ప్రకటన!
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన విశాఖపట్నం రైల్వే జోన్ త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నేడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్‌లో విశాఖ-గుణపూర్ ప్యాసింజర్ రైలు హాల్ట్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రైల్వే కీలక పాత్ర
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, గత ఇరవై ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్న రైల్వే సౌకర్యాలు ఇప్పుడు అందుబాటులోకి రావడం తమకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఏపీలో రైల్వే పురోగతి కూటమి ప్రభుత్వ హయాంలో ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రైల్వే హాల్ట్‌లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు .

అన్ని వర్గాలకు మేలు,డబ్బులు ఆదా
రైల్వేలు అవసరం అయిన చోట్ల హాల్టింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయటం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ప్రయాణ సౌకర్యాలను సులభంగా పొందడంతో పాటు ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని మంత్రి తెలిపారు. అలాగే, శ్రీకాకుళం జిల్లాకు మెరుగైన రైల్వే సదుపాయాలను అందించేందుకు కృషి చేసిన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు, ముఖ్యంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
మూలపేటలో నిర్మాణంలో ఉన్న పోర్ట్ పనులు త్వరలోనే పూర్తి
రానున్న రెండేళ్లలో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని, ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్రమంత్రి అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ పరిధిలోని మూలపేటలో నిర్మాణంలో ఉన్న పోర్ట్ పనులు త్వరలో పూర్తవుతాయని కూడా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రలో రవాణా రంగాన్ని బలోపేతం చేసేలా మూలపేట పోర్టు
ఆ పోర్ట్ ప్రారంభమైతే అంతర్ రాష్ట్ర రవాణా సౌకర్యాలు పెరిగి, వ్యాపార కార్యకలాపాలు విస్తరించి, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని కేంద్రమంత్రి వివరించారు.అనంతరం గుణపూర్, మందస ప్రాంతాల్లో పలు ట్రైన్ హాల్ట్‌లను ప్రారంభించారు. ఈ చర్యలు ఉత్తరాంధ్రలో రవాణా రంగాన్ని బలోపేతం చేస్తున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!













Click it and Unblock the Notifications