
Unstoppable with NBK: బాలకృష్ణ అసమర్ధుడు, లోకేష్ కమెడియన్.. చంద్రబాబుపైనా మంత్రి అంబటి ఘాటువ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై మరోమారు మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు ఆహా ఓటీటీలో ప్రసారమైన అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె 2 సంచలనాత్మక ఎపిసోడ్ లో చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే.
ఇక బాలయ్య టాక్ షోలో చంద్రబాబు చేసిన గతంలో టిడిపిలో చోటుచేసుకున్న 1995 తిరుగుబాటు అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు ఇప్పటికే తనదైన శైలిలో చంద్రబాబుని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.

కుట్రలు, కుతంత్రాలతో అందలం ఎక్కిన వ్యక్తి చంద్రబాబు
ఇక తాజాగా మరోమారు చంద్రబాబు ని టార్గెట్ చేసిన అంబటి రాంబాబు కుట్రలు, కుతంత్రాలతో అందలమెక్కిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. బాలకృష్ణ అసమర్ధుడు, అమాయకుడు అంటూ పేర్కొన్న అంబటి రాంబాబు చంద్రబాబు తన స్వార్థం కోసమే బాలయ్య టాక్ షో కు హాజరయ్యారని విమర్శించారు. ఈ షో ద్వారా వెన్నుపోటు, రక్తపు మరకలు తుడుచుకునే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ఈ టాక్ షో ద్వారా చంద్రబాబు మరింత దిగజారిపోయాడని అంబటి రాంబాబు టార్గెట్ చేశారు.

మీరు చెప్పేవి జనం నమ్మాలా? ప్రశ్నించిన అంబటి రాంబాబు
ఇదే సమయంలో టీడీపీ నేత నారా లోకేష్ హాస్యనటుడు లాంటివాడిని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాడు వినకపోతే జుట్టు పట్టుకుని లాగాం అని చెబితే.. అది న్యాయమే ధర్మమే అంటూ బాలకృష్ణ చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఎన్టీఆర్ మరణం కరెక్ట్ అని మీరు అంటుంటే జనం నమ్మాలా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. లోక కళ్యాణం కోసమే ఎన్టీఆర్ ని దించేశారా? అంటూ చంద్రబాబును ప్రశ్నించిన అంబటి రాంబాబు, అసలు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఒకవేళ ఎన్టీఆర్ మరణించకపోయి ఉంటే మీ పరిస్థితి ఏమిటని చంద్రబాబును టార్గెట్ చేశారు.

గొంతు పిసికి చంపాడు.. హీరోనా.. విలనా.. ట్వీట్
చంద్రబాబు జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం 1995 నిర్ణయమని చెప్పి, నాడు ఎన్టీఆర్ నీ కాళ్ళు పట్టుకొని అడిగినా, నా మాట వినండి అని బతిమాలినా వినలేదని.. ఆయన వినకపోవడంతో అనేక వేస్ట్ అని భావించి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టిన మంత్రి అంబటి రాంబాబు కాళ్ళు పట్టుకొని అడుక్కున్నాడు తన మాట వినమని .. కానీ వినలేదని, గొంతు పిసికి చంపేశాడు ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేశారు.
మరి ఇప్పుడు చంద్రబాబును విలన్ అంటారా? హీరో అంటారా? అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇక తాజాగా మరోమారు చంద్రబాబు పై విరుచుకుపడ్డ అంబటి రాంబాబు తనదైన శైలిలో అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె 2 లో చంద్రబాబు మాట్లాడిన దానిపై మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.