అందర్నీ లాగండి: బాబును ఏకేసిన రోజా, షాకింగ్.. 'కాల్ మనీలో లోకేష్ అనుచరుడు'
హైదరాబాద్: కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన, టిడిపి ప్రభుత్వం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, ఎమ్మెల్యే రోజా గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కాల్ మనీ నిందితులతో చంద్రబాబుకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని జగన్ అసెంబ్లీలో ఫోటోలు ప్రదర్శించారు. శాసన సభ వాయిదా పడిన అనంతరం రోజా విలేకరులతో మాట్లాడారు. కాల్ మనీ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు.
కాల్ మనీ దందాలో నారా లోకేష్ అనుచరుడు ఉన్నారని రోజా ఆరోపించారు. కాల్ మనీలో బుద్దా వెంకన్న ప్రధాన నిందితుడని, అతను నారా లోకేష్ అనుచరుడు కాబట్టే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు అరాచక పాలన సాగుతోందన్నారు.
కాల్ మనీ వ్యవహారంలో అధికార పార్టీ నేతలే సూత్రదారులు అని ఆరోపించారు. కాల్ మనీ పైన సభలో చర్చ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో డబ్బులు పెట్టారని ఆరోపించారు.

టిడిపి నేతలు నిందితులకు తేలు కుట్టిన దొంగల్లా సహకరిస్తున్నారన్నారు. బుద్ధా వెంకన్న, బోడె ప్రసాద్‌లను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కాల్ మనీ - సెక్స్ రాకెట్లో ఉన్న టిడిపి నేతలందర్నీ బయటకు లాగాలన్నారు. కాల్ మనీతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత జరుగుతున్న చంద్రబాబుకు మహిళల బాధ పట్టడం లేదన్నారు. కార్యాలయానికి వెళ్లాలంటే మహిళలకు, కాలేజీకి వెళ్లాలంటే అమ్మాయిలకు భయం కలిగే పరిస్థితి ఉందన్నారు. వనజాక్షి, రిషికేశ్వరి ఘటనలను గాలికి వదిలేశారని, ఇప్పుడు కాల్ మనీ రాకెట్‌ను కూడా అలాగే చేద్దామని చూస్తున్నారన్నారు.
కాల్ మనీ - సెక్స్ రాకెట్ ముఠాతో చంద్రబాబుకు ప్రమేయం ఉందన్నారు. టిడిపి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయేదన్నారు. కాల్ మనీ నిందితులకు ప్రభుత్వం వంత పాడుతోందని మరో ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శాసన సభ వాయిదా అనంతరం జగన్ మాట్లాడుతూ... ఇంత దారుణమైన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేడ్కర్ అంటే మాకు గౌరవం ఉందని ఉప్పులేటి కల్పన చెప్పారు. అంబేడ్కర్ పైన చర్చకు తాము సిద్ధమని బిఏసిలో చెప్పామన్నారు. ఇప్పటికీ తాము సిద్ధమేనని చెప్పారు. తాము ఇఫ్పుడు ఈ స్థానంలో ఉన్నామంటే అది అంబేడ్కర్ చలువే అన్నారు. టిడిపి వారి కంటే తమకు అంబేడ్కర్ పైన ఎక్కువ గౌరవం ఉందన్నారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్











Click it and Unblock the Notifications