ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే క్రికెట్ మ్యాచ్: జెఏసి
విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని, లేదంటే.. విశాఖ నగరంలో జరగబోయే ఇండియా-వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్‌ను అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర పొలిటికల్ జెఏసి ఛైర్మన్ జెటి రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం ఉదయం స్థానిక జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జెఏసి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్, స్టీల్ ప్లాంటుకు సొంత గనులు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, ఐఐటి, హైకోర్టు లాంటి అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నాయని చెప్పారు.

ప్రతి సంవత్సరం రూ. 35వేల కోట్లు పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నా ఉత్తరాంధ్రకు మాత్రం కన్నీళ్లే మిగిలాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే విమానాశ్రయం, క్రికెటర్లు బస చేసే హోటళ్ల వద్ద, మైదానంలోనూ ఆందోళన నిర్వహిస్తామని రామారావు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కె రామచంద్రమూర్తి, కోటేశ్వరరావు, రాంప్రసాద్, శ్రీరామమూర్తి, అవినాష్, శకుంతల, గీత పాల్గొన్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications