జగన్‌కు థ్యాంక్స్‌ చెప్పిన అఖిలప్రియ- ఆయన నిర్ణయం సీమకే గర్వకారణమంటూ

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్‌ ఎయిర్‌పోర్టుకు తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయాన్ని రాయలసీమ ప్రజలతో పాటు నేతలు కూడా స్వాగతిస్తున్నారు. ఇదే కోవలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ చారిత్రక నిర్ణయంపై జగన్‌కు థ్యాంక్స్‌ చెప్పారు. ఇప్పుడు ఇదే కోవలో టీడీపీ నేతలు కూడా చేరిపోయారు.

రాయలసీమలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ప్రకటన తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, కర్నూరు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు పెట్టడం మొత్తం రాయలసీమకే గర్వకారణమని ఆమె అన్నారు. తొలి స్వాతంత్య్ర సమర యోధుడిగా, రాయలసీమకు చెందిన త్యాగశీలిగా పరిచితమైన ఉయ్యాలవాడ పేరు ఇకపై చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా జగన్ చేశారని అఖిలప్రియ వ్యాఖ్యానించారు.

uyyalavada narasimhareddy airport : tdp leader bhuma akhila priya thanks to cm jagan

గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి జగన్‌ను కాదని టీడీపీలోకి ఫిరాయించిన భూమా అఖిలప్రియ తండ్రి నాగిరెడ్డి మరణం తర్వాత మంత్రి పదవి కూడా చేపట్టారు. ఆ తర్వాత కూడా జగన్‌పై వరుసగా విమర్శలు చేశారు. తాజాగా హైదరాబాద్‌లో బోయిన్‌పల్లి కిడ్నాప్‌ వ్యవహారంలోనూ తెలంగాణ పోలీసులు తమను టార్గెట్‌ చేయడం వెనుక జగన్ సర్కారు ప్రభావం ఉందని భూమా కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసు నుంచి ఆమెతో పాటు భర్త భార్గవ్‌రామ్‌, సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+