ముద్రగడ అనుకున్నది సాధిస్తారు, కేంద్రానిదే బాధ్యత: వీహెచ్ పరామర్శ
తూర్పుగోదావరి: కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి హన్మంతరావు పరామర్శించారు. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చేరుకున్న వీహెచ్.. ఇటీవల నిరాహార దీక్ష చేసిన ముద్రగడను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడ తాను అనుకున్నది సాధిస్తారన్న నమ్మకం తనకుందని అన్నారు. అంతేగాకాకుండా ముద్రగడకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని కూడా వీహెచ్ డిమాండ్ చేశారు.

తుని ఘటనలో అరెస్ట్ చేసిన నిందితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షచేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బలవంతంగా ముద్రగడను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు పోలీసులు. ఆ తర్వాత ముద్రగడ కిర్లంపూడికి వెళ్లి తన దీక్షను విరమించారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారందరికీ బెయిల్ లభించడంతో వారు బయటకు వచ్చారు.












Click it and Unblock the Notifications