మేం వస్తే చంద్రబాబును జైల్లో పెడతాం: తమిళనాడు నేత సంచలనం

చెన్నై: తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిను జైలుకు పంపుతామని తమిళ పార్టీ ఎండిఎంకె పార్టీ అధినేత వైగో సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ క్రమంలో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో సోమవారం ఆ రాష్ట్రంలోని కరూర్‌లో జరిగిన ప్రచారంలో వైగో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల తిరుపతి సమీపంలో జరిగిన తమిళ కూలీల ఎన్ కౌంటర్‌ను ప్రస్తావించారు.

Vaiko hot comments on AP CM Chandrababu

ఎర్రచందనం కూలీల పేరిట 20మంది అమాయక తమిళ కూలీలను ఏపీ ప్రభుత్వం ఎన్‌కౌంటర్ చేసిందని ఆరోపించారు. ఎన్‌కౌంటర్ పేరిట తమిళులను చంపేసిన ఏపీ సీఎం చంద్రబాబును తాము అధికారంలోకి వస్తే తప్పకుండా జైలుకు పంపుతామన్నారు.

కాగా, గత ఏడాది శేషాచలంలో ఎర్రచందనం దొంగతనం నేపథ్యంలో ఇరవై మంది కూలీలను పోలీసులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన కూలీలు అందరూ కూడా దాదాపు తమిళనాడుకు చెందినవారే. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+