వైకుంఠ ద్వార దర్శనం- పోటెత్తిన భక్త జనం..!!
వైకుంఠ ఏకాదశి వేళ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు మొదలయ్యాయి. ప్రముఖ దేవాలయాల కు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ పుణ్య రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాలకు తరలి వస్తున్నారు. దీంతీ ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తెల్లవారు జాము నుంచే భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ప్రముఖులతో పాటుగా సాధారణ భక్తులు సైతం దర్శనం చేసుకుంటున్నారు.
వైకుంఠ ఏకాదశి వేళ
తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 3.45 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనంతో ఆ దేవ దేవుడిని దర్శించుకుంటున్నారు. ఈరోజు నుంచి ఈ నెల 19వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పించారు. ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను అధికారులు రద్దు చేశారు. ఈ రోజు శుక్రవారం కావడంతో అర్చకులు శ్రీవారికీ ఏకాంతంగా అభిషేకాన్ని నిర్వహించారు. వైకుంఠ ద్వారా దర్శనం కోసం ప్రముఖులకు 4250 పాసులని మంజూరు చేశారు.

ఉత్తర ద్వార దర్శనం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం క్షేత్రంలో శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం వైభవ పితంగా ప్రారంభమైంది.. సింహాద్రి అప్పన్న స్వామి ఆలయ ఉత్తర గోపురంలో వైకుంఠనాధుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు. పలువురు ప్రముఖులు ఉత్తర ద్వారం ద్వారా సింహాద్రి అప్పన్న దర్శించుకున్నారు. భద్రాచలంలో సరిగ్గా ఉదయం 5 గంటలకు భక్తులకు సీతారామచంద్ర స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. స్వామి సేవలో తరించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.
భక్తుల రద్దీ
యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ స్వామివారికి గరుడ సేవోత్స వం, తిరువీధిసేవ నిర్వహించనున్నారు. ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తా రు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు వస్తున్నారు. ఉత్తర ద్వార నుంచి దేవుడిని దర్శనం చేసుకుంటున్నారు. దీంతో, ఆలయాల వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళగిరి పానకాల స్వామి ఆలయంలోనూ భక్త జన సందోహం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం భక్త శ్రద్దలతో వైభవంగా నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications