వంగవీటి రాధాతో వల్లభనేని వంశీ భేటీ వెనుక, ఏం జరుగుతోంది..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కూటమి నేతలు అలర్ట్ అవుతున్నారు. మూడు పార్టీలు సీట్ల షేరింగ్.. పోటీ పైనా వరుస భేటీ లు నిర్వహిస్తున్నారు. అటు వైసీపీ సైతం సమాయత్తం అవుతోంది. మాజీ సీఎం జగన్ సైతం పార్టీ నేతలకు స్థానిక ఎన్నికలకు దిశా నిర్దేశం చేసారు. ఈ సమయంలోనే వల్లభనేని వంశీ స్వయంగా వంగవీటి రాధా నివాసానికి వెళ్లారు. ఈ భేటీ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
వంగవీటి రాధాతో వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. చాలా రోజుల తరువాత ఇద్దరూ కలవటం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది. రాధా ఇంటికి వంశీ వెళ్లారు. ప్రస్తుతం వంగవీటి రాధా టీడీపీలో కొనసాగుతున్నారు. వంశీ వైసీపీలో తిరిగి యాక్టివ్ అవుతున్నారు. 2019 ఎన్నికల ముందు రాధా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆ సమయంలో రాధాకు ఎమ్మెల్సీ పదవి పైనా పార్టీ నుంచి హామీ దక్కింది. ఇప్పటి వరకు అమలు కాలేదు. అదే విధంగా 2019 లో టీడీపీ నుంచి గెలిచిన వంశీ వైసీపీకి దగ్గరయ్యారు. 2024 ఎన్నికల్లో వంశీ ఓడిపోయారు. అయితే, కొడాలి నాని .. వంశీ.. వంగవీటి రాధా పలు సందర్భాల్లో కలిసారు. ముగ్గురూ మిత్రులు కావటంతో వీరి భేటీలు ఆసక్తి కరంగా జరిగాయి. ఇక, తాజాగా రాధాకు మరోసారి ఎమ్మెల్సీ పదవి ఖాయమని ప్రచారం సాగింది. టీడీపీ నుంచి ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రకటించారు.

తాజా భేటీ .. కీలక చర్చ
అయితే, ఈ సారి వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. ఈ సమయంలోనే వంగవీటి రాధా ఇంటికి వంశీ వెళ్లారు. దీని వెనుక ఆసక్తి కర కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. మిత్రుడు కుమారుడి వివాహానికి రాధాను ఆహ్వానించడానికి వంశీ ఆయనను వెంటబెట్టుకుని వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ జరిగితే విజయవాడ కేంద్రంగా టీడీపీ - జనసేన నుంచి వంగవీటి రాధాకు పోటీకి అవకాశం దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, డీలిమిటేషన్ పైనా స్పష్టత రావటం లేదు. దీంతో.. వంగవీటి రాధా రాజకీయ భవితవ్యం పైన స్పష్టత రావటం లేదు. ఈ సమయంలోనే భేటీ జరగటం ఆసక్తి కరంగా మారింది. కాగా.. ఈ భేటీ మాత్రం కేవలం ఇద్దరి మధ్య ఉన్న సత్సంబంధాల్లో భాగంగానే జరిగిందని చెబుతున్నారు. రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేదని చెబుతున్నారు.













Click it and Unblock the Notifications