వందేభారత్ తో ఇంత లాభం ఉందా - తేల్చిన తాజా లెక్కలు..!!

వందేభారత్ వ్యవస్థ విమాన రంగం పైన ప్రభావం చూపుతోంది. వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత విమాన ఛార్జీల్లో తగ్గుదల కనిపిస్తోంది. అదే సమయంలో ప్రధాన నగరాలకు విమానప్రయాణా లపైన ఆదరణ తగ్గుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దశల వారీగా అందుబాటులోకి వస్తున్న వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. విమానాల తరహాలో వందేభారత్ లో సీటింగ్..ఆహాన మెనూ వంటి సౌకర్యాలతో ప్రయాణీకులు విమానయానం కంటే వందేభారత్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు గుర్తించారు.

విమాన ప్రయాణం కంటే కొన్ని మార్గాల్లో వందేభారత్ లో ప్రయాణానికే ఆదరణ ఎక్కువగా ఉందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత విమాన ఛార్జీల్లో సగటున 20 నుంచి 30 శాతం తగ్గాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. వందేభారత్ లో ధరలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. అదే ఇప్పుడు విమాన ప్రయాణీకుల పైన ప్రభావం చూపుతోంది. విమాన ప్రయాణీకులు గంట ముందు విమానాశ్రయం చేరుకోవటం..ప్రయాణ సమయం..తరువాత గమ్య స్థానంలోని విమానాశ్రయం నుంచి కావాల్సిన చోటకు వెళ్లే సమయం..ఇలా అన్నీ పరిగణలోకి తీసుకున్న తరువాత వందేభారత్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు గుర్తించారు.

Vande Bahrat Effect: Decline of 10–20% in air traffic and a reduction of 20–30% in airfare As Reports

ప్రయాణికుల లింగం, వయస్సు ఆధారంగా వందే భారత్ రైళ్లడిమాండ్‌ను రైల్వే శాఖ తొలిసారి పర్యవేక్షిస్తోంది. ముంబయి నుంచి ప్రారంభమయ్యే వందే భారత్ లో అత్యధికులు 31-45 ఏళ్ల వయస్సు గలవారే.. ఆ తరువాతి స్థానంలో 15 - 30 ఏళ్ల వయస్కులు ఎక్కువగా ఉంటారు. సెప్టెంబర్ 15 - అక్టోబరు 13 మధ్య ముంబయి నుంచి షిర్డీ, గోవా, షోలాపూర్‌ వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణాంకాలతో వివరించారు. మొత్తం 85 వేల 600 మంది పురుషులు, 26 మంది ట్రాన్స్‌జెండర్లు, 57 వేల 838 మంది మహిళలు వందేభారత్ లో ప్రయాణించారు. వందే భారత్ లో సేవలు, ఆహార మెనూ, ఇతర సౌకర్యాలతో ప్రయాణీకుల ఆదరణ పెరుగుతోందని గుర్తించారు. విమాన ప్రయాణంతో వందేభారత్ ప్రయాణం గురించి పోలిక మొదలైంది. దీంతో మరిన్ని మార్పులు చేసి.. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+