వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలందించేందుకు అధునాతన రైళ్లను భారతీయ రైల్వే ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా వందే భారత్ రైళ్లను తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా 26 మార్గాల్లో ఇవి ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న వందేభారత్ రైళ్ల రంగు నీలం. ఇవి అందరినీ ఆకర్షించాయి.
ఇటీవలి కాలం నుంచి ఆరెంజ్ కలర్ వందే భారత్ రైళ్లను తయారు చేస్తున్నారు. తొలిసారిగా ఈ ఆరెంజ్ వందే భారత్ రైలు విజయవంతంగా పరుగులు తీసింది. కొద్దిరోజుల క్రితం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఆరెంజ్ కలర్‌లో తయారైన వందే భారత్ రైలును చూసి, ఆ ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేశారు. అవి అందరినీ ఆకర్షించాయి. జాతీయ జెండాలోని కాషాయరంగును స్ఫూర్తిగా తీసుకొని వీటిని తయారుచేసినట్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ తెలిపారు. తయారీ పూర్తయిన కాషాయ రంగు రైలు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి పాడీ రైల్వే ఫ్లైఓవర్ రూట్‌లో ట్రయల్ రన్ జరిగింది.

వందేభారత్ బోగీలను మెరుగైన ఫీచర్లతో అప్ గ్రేడ్ చేశారు. ప్రధానంగా ప్రయాణికుల సౌలభ్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. వీటిల్లో మరుగుదొడ్లు, మెరుగైన లైటింగ్, వాష్ బేసిన్ బౌల్స్, మెరుగైన టాయిలెట్ హ్యాండిల్స్, అత్యవసర పరిస్థితుల కోసం హ్యామర్ బాక్స్, టాక్‌బ్యాక్ యూనిట్, అప్‌గ్రేడ్ చేసిన ఫైర్ డిటెక్షన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లల్లో ఉండే ఫీచర్లను కూడా అప్ గ్రేడ్ చేసి మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించారు.












Click it and Unblock the Notifications