వందే భారత్ లో ఇక గుంటూరు కోడికూర ఘుమఘుమలు: రూట్ ఇదే

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అద్దిరిపోయే సమాచారాన్ని అందించింది రైల్వే శాఖ. వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లలో ప్రాంతీయ వంటకాలను ప్రవేశపెట్టింది. వివిధ రాష్ట్రాల వైవిధ్య భరితమైన ఘుమఘుమలాడే వంటకాలను ప్రయాణికులకు అందించనున్నట్లు వెల్లడించింది. తొలిదశలో మొత్తం 11 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లల్లో వీటిని అందించనుంది. క్రమంగా మిగిలిన వాటికి విస్తరిస్తుంది.

పలు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లల్లో ఈ ప్రాంతీయ వంటకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఏపీ, తెలంగాణకు చెందిన వందే భారత్ రైళ్లల్లో కోడికూర అందుబాటులోకి వచ్చింది. గుంటూరు కోడికూర ఘుమఘుమలు ప్రయాణికులను నోరూరిస్తోన్నాయి. ఆంధ్రా కోడి కూర, దొండకాయ కారం పొడి ఫ్రై వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో వడ్డిస్తోన్నారు. మహారాష్ట్రకు చెందిన కాందా, పోహా వంటివి ప్రయాణికులకు అందిస్తారు.

Vande Bharat Trains Get Authentic Local Flavors to Celebrate India s Culinary Diversity
  • 20101 నాగ్ పూర్- వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఆంధ్రా కోడి కూర, దొండకాయ కారం పొడి ఫ్రై వడ్డిస్తోన్నారు. మహారాష్ట్రకు చెందిన కాందా, పోహా ఈ రైలులో అందుబాటులో ఉంటుంది.
  • 22229 ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్- మడ్గావ్ జంక్షన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మహారాష్ట్ర మసాలా ఉప్మాను కూడా అందిస్తున్నారు.
  • 20901 ముంబై సెంట్రల్- గాంధీనగర్ క్యాపిటల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో గుజరాతీ వంటకం మెంతి తేప్లా అందుబాటులోకి వచ్చింది.
  • 26902 విరావెల్- సబర్మతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మసాలా లౌకీ వడ్డిస్తారు.
  • 22895 హౌరా-పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఒడిశాకు చెందిన ఆలూ ఫుల్కోపీ వడ్డిస్తారు.
  • 20872 రూర్కేలా- హౌరా వందే భారత్ ఎక్స్ ప్రెస్ మెనూలో పశ్చిమ బెంగాల్ కు చెందిన కోషా పనీర్ చేరింది.
  • 22895 హౌరా- పూరీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఆలూ పోటోల్ భాజా వడ్డించనున్నారు.
  • 22302 న్యూ జల్ పాయ్ గురి- హౌరా వందే భారత్ లో ముర్గీ ఝోల్ లభిస్తుంది.
  • 20633/34 కాసర్‌గోడ్-తిరువనంతపురం, 20631/32 మంగళూరు-తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో కేరళ సాంప్రదాయ భోజనం అయిన సద్య అన్నం, పచ్చక చెరూపయార్ మేచుక్కు పెరాటి, కడల కూర, కేరళ పరోటా, సాదా పెరుగు, పాలడ పాయసం, అప్పం వంటివి లభిస్తాయి.
  • 22349 పాట్నా- రాంచీ వందే భారత్ లో బీహార్‌కు చెందిన చంపారన్ పనీర్, చంపారన్ చికెన్ అందిస్తారు.
  • 26401, 26403 కాట్రా- శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లల్లో డోగ్రీ వంటకాలైన అంబల్ కద్దు, జమ్మూ చనా మసాలాలు అందుబాటులో ఉన్నాయి. కశ్మీర్ ప్రత్యేకతలుగా పేరొందిన టొమాటో చమన్, కేసర్ ఫిర్ని వంటకాలు ప్రయాణికులకు అందిస్తున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+