కొత్త వందేభారత్.. అదిరిపోయింది!
మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో మంచి ప్రయాణ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో భారతీయ రైల్వే సెమీ హైస్పీడ్ రైళ్లు వందే భారత్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్ గా ఒకేసారి 9వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఇందులో ఉన్న ఫీచర్లు ప్రయాణికులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికుల నుంచి లభించే ఆదరణను బట్టి అవసరమైతే రాబోయే వందే భారత్ రైళ్లల్లో మరింత మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని అధికారులు తెలిపారు.
* కొత్తగా ప్రధానమంత్రి ప్రారంభించిన వందే భారత్ రైళ్లల్లో ఉన్న అత్యాధునిక సౌకర్యాలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

* ప్రయాణికులు తమ సీట్లను మరింతగా వెనక్కి జరిపి కూర్చోవడానికి వీలుగా రిక్లైనింగ్ యాంగిల్ ను మార్చారు.
* కూర్చునే కుషన్ గట్టిగా ఉందని ఫిర్యాదులు రావడంతో మెత్తటి కుషన్ ఏర్పాటు చేశారు.
* ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును ఎరుపు నుంచి నీలంకు మార్చారు.
* ఫుట్ రెస్ట్ ను పొడిగించారు.
* సీట్ల వెనక మ్యాగజైన్ బ్యాగ్స్ ను ఏర్పాటు చేశారు.
* సీట్ల కింద మొబైల్ ఛార్జింగ్ పాయింట్ లో కొన్ని మార్పులు చేశారు.
* టాయిలెట్ లో మంచి లైటింగ్ కోసం 2.5 వాట్ బల్బులు అమర్చారు.
* వాష్ బేసిన్ సైజును పెంచారు.
* వాటర్ ట్యాప్ లు, టాయిలెట్ హ్యాండిల్స్ ను కొత్తగా డిజైన్ చేశారు.
* దివ్యాంగుల వీల్ ఛైర్ ను భద్రపరిచేందుకు ప్రత్యేకమైన పాయింట్లను ఏర్పాటు చేశారు.
* లగేజ్ ర్యాక్ లైట్లకు మృదువైన టచ్ కంట్రోల్స్ ఏర్పాటు చేశారు.
* ఏరోసోల్ ఫైర్ డిటెక్సన్ వ్యవస్థను మెరుగుపరిచారాు.












Click it and Unblock the Notifications