రోజాకు సవాల్ విసిరి.. షర్మిల కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోండన్న వంగలపూడి అనిత!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తనదైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ నేతలు వైఎస్ షర్మిలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారని అయితే ఆనాడు వైయస్ షర్మిల పాదయాత్ర చేస్తేనే వైసీపీ అధికారంలోకి వచ్చిందన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. వైసీపీ నేతలు షర్మిల కాళ్లు కడిగిన నెత్తిన చల్లు కోవాలని ఆమె సూచించారు.

గతంలో వైయస్ షర్మిల జగన్ కోసం ఎంతగా పనిచేశారో గుర్తు తెచ్చుకోవాలని వంగలపూడి అనిత వైసీపీ నేతలకు హితువు పలికారు. జగనన్న బాణం ఇప్పుడు వైసీపీకి తిరిగి గుచ్చుకుంటుంది అని, షర్మిల రాక వల్ల వైసీపీకి భారీగా గండి పడిందని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.

vangalapudi anitha challenge to minister roja, and made interesting comments on ys sharmila

ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వంగలపూడి అనిత వై నాట్ 175 నుంచి సంతోషంగా దిగి పోతా అనే స్థాయికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగిపోయారు అని వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయినా తనకు ఎలాంటి విచారం లేదని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం అందుకు తార్కాణం అని వంగలపూడి అనిత అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక ఇదే సమయంలో రోజా పైన సంచలన ఆరోపణలు చేసిన వంగలపూడి అనిత అవినీతి తోటలో రోజాపూలు విరబూశాయి అని వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ మాటలు నగరి పార్టీ నేతలు చెబుతున్నారని రోజాను అనిత టార్గెట్ చేశారు. చైర్ పర్సన్ పదవి కోసం రోజా తన బినామీలతో 40 లక్షల రూపాయలు స్వాహా చేశారని, దళిత మహిళ దగ్గర డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు.

అంతేకాదు టీటీడీ దర్శనాల కోసం నెలకు 20 లక్షల రూపాయలు రోజా తీసుకుంటున్నారని తిరుమల శ్రీవారి తో పెట్టుకుంటే రోజా పుట్టగతులు లేకుండా పోతుందని వ్యాఖ్యలు చేశారు. జబర్దస్ట్ పొమ్మంది.. ఇప్పుడు నగరి కూడా పొమ్మంటుంది అని రోజాపై సెటైర్లు వేసిన అనిత పర్యాటక శాఖను తన అవసరాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.

రోజా రెడ్డి చెప్పులు పట్టుకోవడానికి ఉద్యోగి ఉన్నారని , ఈ సౌకర్యం జగన్ కు, భారతి రెడ్డికి కూడా లేదు అంటూ వంగలపూడి అనిత సెటైర్లు వేశారు. ఇసుక, గ్రావెల్, భూ ఆక్రమణలలో రోజా అడ్డంగా సంపాదించారని విమర్శించారు. ఇక తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్న వంగలపూడి అనిత, ఒకవేళ రోజా ఏ తప్పు చేయకపోతే ఏ గుడిలోనైనా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+