చిన్నారుల చావుడప్పుల మధ్యే మంత్రిగా విడదల రజినీ ఛార్జ్; జగన్ పైనా విరుచుకుపడిన అనిత

తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈరోజు బాధ్యతలు చేపట్టిన విడదల రజిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. అలాగే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వ ఆసుపత్రులు నరక కూపాలుగా ఉన్నాయని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

 కడప రిమ్స్, తిరుపతి రుయా ఆస్పత్రులలో శిశు మరణాలపై వంగలపూడి అనిత

కడప రిమ్స్, తిరుపతి రుయా ఆస్పత్రులలో శిశు మరణాలపై వంగలపూడి అనిత


సోమవారం మీడియాతో మాట్లాడిన వంగలపూడి అనిత ఆసుపత్రిలో సంభవిస్తున్న శిశు మరణాలు ప్రభుత్వ హత్యలే అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప రిమ్స్ లో ముగ్గురు చిన్నారులు కరెంటు కోతల వల్ల వెంటిలేటర్ పనిచేయక మృతి చెందారని, ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆరోగ్యశాఖ అసమర్థత వల్ల అభం శుభం తెలియని చిన్నారులు మృత్యువాత పడుతున్నారని వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఇక తిరుపతి రుయా ఆస్పత్రిలో వారం వ్యవధిలో 16 మంది శిశువులు మృతి చెందారని ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని అనిత పేర్కొన్నారు.

పసిబిడ్డలను కోల్పోయిన తల్లుల రోదనలు మిన్నంటినా స్పందన లేదు

పసిబిడ్డలను కోల్పోయిన తల్లుల రోదనలు మిన్నంటినా స్పందన లేదు


వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యం శిశువుల మృతికి కారణమని వంగలపూడి అనిత ఆరోపణలు గుప్పించారు. వైద్య, ఆరోగ్య అధికారులు కానీ వైద్య శాఖ మంత్రి గానీ పసిబిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటినా స్పందించడం లేదని వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఇది దేనికి సంకేతం అని ఆమె ప్రశ్నించారు. పైగా వాస్తవాలు వెలుగులోకి రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం అమానుషం కాదా అంటూ వంగలపూడి అనిత ప్రభుత్వాన్ని నిలదీశారు. తల్లిదండ్రులు కడుపుకోత వైసీపీ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు వంగలపూడి అనిత.

చిన్నారుల చావు డప్పుల మధ్య వైద్య శాఖామంత్రి చార్జ్

చిన్నారుల చావు డప్పుల మధ్య వైద్య శాఖామంత్రి చార్జ్


వరుస ఘటనలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఇక చిన్నారుల చావు డప్పుల మధ్య మంత్రిగా ఎలా ఛార్జ్ తీసుకోలిగారు అంటూ అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పటివరకు వైద్యాధికారులు పరిశీలించిన దాఖలాలు లేవని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల నిర్వహణ దారుణంగా ఉందని పేర్కొన్న వంగలపూడి అనిత, ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆసుపత్రులలో పర్యటిస్తే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోందని అనిత వ్యాఖ్యానించారు.

తల్లుల కడుపు కోతకు ప్రభుత్వ ఏం సమాధానం చెబుతుంది

తల్లుల కడుపు కోతకు ప్రభుత్వ ఏం సమాధానం చెబుతుంది


అసలు ఆసుపత్రుల్లో ప్రసవాలకు గానీ, చిన్నారులను ఉంచడానికి గానీ సరైన సదుపాయాలు లేవని తెలుస్తోందని వంగలపూడి అనిత పేర్కొన్నారు. మొదటి శిశువు మరణం సంభవించినప్పుడు వైద్యులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటం లేదని ఆసుపత్రికి వచ్చిన తల్లులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వంగలపూడి అనిత మండిపడ్డారు. నవమాసాలు మోసి కన్న బిడ్డ కళ్ళముందు మృత్యుఒడిలోకి జారిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది అని తల్లుల కడుపు కోతకు ప్రభుత్వ ఏం సమాధానం చెబుతుందని వంగలపూడి అనిత ప్రశ్నించారు

శిశు మరణాలపై సమగ్ర విచారణకు అనిత డిమాండ్

శిశు మరణాలపై సమగ్ర విచారణకు అనిత డిమాండ్


పసికందుల మరణాలతో తిరుపతి రుయా ఆసుపత్రి రోదనలతో నిండి పోయిందని పేర్కొన్న అనిత, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులకు తల్లులు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది అంటూ వ్యాఖ్యానించారు. తిరుపతి రుయా ఆసుపత్రి తో పాటుగా వివిధ ఆస్పత్రులలో జరిగిన శిశు మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వ ఆసుపత్రుల విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు ఏర్పాట్లు చేసి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+