ఏమ్మా రోజా.. ఇంతకన్నా దిగజారిపోవడానికి ఏముంది? వంగలపూడి అనిత టార్గెట్!!
టిడిపి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత రోజా తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన ఆమె రోజా దిగజారిపోయారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర రోజా నియోజకవర్గమైన నగరిలో కొనసాగిన వేళ ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. జబర్దస్త్ ఆంటీ జబర్దస్త్ గా భూకబ్జాలు చేస్తోందంటూ రోజాపై లోకేష్ విమర్శలు గుప్పించారు. ఇక దీంతో ఎదురు దాడి చేసిన ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా లోకేష్ పరువు నిలువునా తీశారు. ఇక దానికి కొనసాగింపుగా రచ్చ సాగుతుంది.

లోకేష్ పై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
మహిళలతో కొట్టిస్తానని, చీర, గాజులు పంపిస్తానని, లోకేష్ అంకుల్ ఒక ఐరన్ లెగ్ అంటూ అందుకే పాదయాత్ర మొదటి రోజే తారక రత్న కోమాలోకి పోయాడని తనదైన శైలిలో మండిపడ్డారు. లోకేష్ చేస్తుంది పాదయాత్ర కాదన్న మంత్రి అది జోకేష్ యాత్ర అంటూ ఎద్దేవా చేశారు. జగన్ పులి అయితే లోకేష్ పులకేసి అంటూ ఎద్దేవా చేశారు. తాను జబర్దస్త్ చేసినందుకు ఆంటీ అయితే హెరిటేజ్ నడుపుతున్న మీ అమ్మ, భార్య లను ఏమనాలి అంటూ విమర్శించారు.

రోజా వ్యాఖ్యలపై చీర, గాజులతో రోజా ఇల్లు ముట్టడించిన టీడీపీ
ఇక రోజా వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు నగరిలో మంత్రి ఆర్కే రోజా ఇంటి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. చీర, గాజులతో రోజా ఇంటిని ముట్టడించి ఆమె ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు. ఇక పోలీసులు ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో నిరసనకారులను కంట్రోల్ చేశారు. పలువురు తెలుగు దేశం పార్టీ మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.

రోజాను టార్గెట్ చేసిన వంగలపూడి అనిత
మంత్రి రోజా లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో పటు టీడీపీ తెలుగు మహిళా నాయకులను పోలీసులు అరెస్ట్ చెయ్యటంపై తెలుగుదేశం పార్టీ నేతలు తమదైన శైలిలో మండిపడుతున్నారు. టిడిపి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత రోజా తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన ఆమె రోజా దిగజారిపోయారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

నీకు చీర, గాజులు ఇస్తే అవమానం ఎందుకు అవుతుంది?
ఏమ్మా రోజా! నువ్వు మా లోకేష్ గారికి పంపుతాను అన్న చీర, గాజులనే.. ఒక స్త్రీగా నీకు సాటి స్త్రీలు ఇవ్వడానికి వస్తే తీసుకోవడానికి నీకు అభ్యంతరం ఎందుకు? అంటూ ప్రశ్నించారు వంగలపూడి అనిత. స్త్రీలకు చీర, గాజులు ఇస్తే అది గౌరవం అవుతుంది కానీ అవమానం ఎందుకు అవుతుంది? అని ప్రశ్నించారు. పైగా నీ కిరాయి మూకను పంపి మహిళలపై దాడి చేయిస్తావా? అంటూ నిలదీశారు. అంతేకాదు ఇంతకన్నా దిగజారిపోివడానికి ఏముంది? అంటూ మంత్రి రోజా తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మహిళలు అని కూడా చూడకుండా మహిళలపై రోజా దాడి చేయించారని వంగలపూడి అనిత ఆరోపణలు గుప్పించారు.

రూల్స్ కి వ్యతిరేకంగా టీడీపీ మహిళలను రాత్రి స్టేషన్లో నిర్బంధించారు
సాయంత్రం 6 దాటిన తర్వాత మహిళలను పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు అన్న రూల్ ఉన్నా, రూల్స్ కి వ్యతిరేకంగా టీడీపీ మహిళలను రాత్రి అయినా స్టేషన్లో నిర్బంధించారు అని వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నిద్దాం అంటే ఈ డీజీపీ గారు తెలుగుదేశం వారికి ఎప్పుడూ అపాయింట్మెంట్ ఇవ్వరు అంటూ పోలీసులు కూడా అధికార పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కొమ్ముకాస్తున్నారని వంగలపూడి అనిత విమర్శలు చేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications