Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ ఆఫర్ కు రాధా నో, జనసేన వైపే - ఆ సీటు పైనే గురి..!?

వంగవీటి రాధా కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల వేళ రాజకీయంగా తన స్థానం సుస్థిరం చేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన రాధా ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టి మళ్లి చట్టసభల్లోకి అడుగు పెట్టేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అడుగులు జనసేన వైపు పడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

రాధా అడుగులు ఎటు : 2019 ఎన్నికల ముందు వైసీపీ తో విభేదించి రాధా టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేసారు. ఎమ్మెల్సీ ఇస్తారనే హామీ ఇచ్చినా అమలు కాలేదు. ఇప్పుడు జనసే నుంచి రాధాకు ఆహ్వానం ఉంది. ప్రస్తుతం టీడీపీతో జనసేన పొత్తు ఖాయమని ప్రచారం సాగుతున్న వేళ రాధా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Vangaveeti Rahda to join in Janasena soon, wants to contest form Vijayawada central

తాజాగా తన ముఖ్య అనుచరులతో భవిష్యత్ రాజకీయాల పైన చర్చలు చేసారు. అందులో తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. జనసేన నుంచి ఒత్తిడి వస్తున్న క్రమంలో ఆ పార్టీలో చేరేందుకు రాధా సిద్దంగా ఉన్నారని సమాచారం . అయితే, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేయాలనేది రాధా నిర్ణయంగా చెబుతున్నారు.

సెంట్రల్ సీటు పై గురి : వంగవీటి రాధా వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి సిద్దం అవుతున్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకు సీటు ఇవ్వటం ఖాయమైందనేది పార్టీ నేతల సమాచారం. అందులో రాధా కు టీడీపీ నుంచి విజయవాడ తూర్పు సీటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గద్దే రామ్మోహన్ ను వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు గద్దే రామ్మెహన్ సుముఖంగా లేరనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాశ్ కు సీటు ఖాయమైంది. నియోజకవర్గంలో అవినాశ్ పర్యటనలు చేస్తున్నారు.

Vangaveeti Rahda to join in Janasena soon, wants to contest form Vijayawada central

జనసేనలో చేరిక ఖాయమేనా : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టిన రాధా జనసేనలో చేరేందుకు కూడా ఈ సీటు గురించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రాధా జనసేనలో చేరాలంటే సెంట్రల్ సీటు పైన హామీ తరువాత మాత్రమే చేరుతారని మరో వాదన వినిపిస్తోంది.

పవన్ స్వయంగా జోక్యం చేసుకొని పొత్తు ఖాయమైనా సెంట్రల్ సీటు రాధాకు ఇచ్చేలా హామీ ఇస్తే రాధా జనసేనలో చేరుతారని చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు టీడీపీ - జనసేన పొత్తు సమయంలో ఈ సీటు విషయంలో జరిగే నిర్ణయం ఆధారంగా వంగవీటి రాధా రాజకీయ అడుగులు ఉండే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగానే నిర్ణయం వస్తుందనే అంచనాలు కనిపిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+