ఆస్తులు కావాలన్న వాణికి మాధురి షాక్.. దువ్వాడ కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంశం ప్రస్తుతం సంచలనంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తున్నారని గత నాలుగు రోజులుగా ఆయన ఇంటి ముందే బైఠాయించి భార్య వాణి, కూతురు హైందవి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. టెక్కలిలోని ఆయన నివాసం వద్ద ఆందోళన చేస్తున్న వాణి మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకొని తనను, తన బిడ్డల భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపిస్తున్నారు.
ఆస్తులు అడుగుతున్న దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి
ఇక తాజాగా తన డబ్బులతోనే దువ్వాడ ఇల్లు కట్టారని అటువంటి ఇంటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని దువ్వాడ వాణి మండిపడ్డారు. తన ఆస్తులు తనకు ఇచ్చి విడాకులు ఇస్తే ఎటువంటి ఇబ్బంది లేదని వాణి పేర్కొన్నారు. ప్రధానంగా వాణి ఆస్తుల కోసం పోరాటం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాధురి కోసం ఆస్తులు కరిగిస్తున్నారని ఆరోపణలు చేశారు.

వాణి ని ఆధారాలతో ఆస్తుల కోసం రావాలన్న మాధురి
ఇదిలా ఉంటే దువ్వాడ వాణి ఆరోపణలతో ప్రత్యారోపణలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ తో సహజీవనం చేస్తున్న మహిళ దివ్వెల మాధురి ఆస్తులు తనవేనని ఎవిడెన్స్ తో రావాలని వాణి కి సవాల్ విసిరారు. తాను దువ్వాడ శ్రీనివాస్ కు అనేకసార్లు డబ్బులు ఇచ్చానని అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని అలాంటప్పుడు టెక్కలిలో ఉన్న ఇంటిపైన తనకు కూడా హక్కు ఉంటుందని వ్యాఖ్యలు చేశారు.
ఆ ఒక్కటీ అడక్కు.. అంటున్న శ్రీనివాస్
ఇక ఇదే సమయంలో వాణి మాధురిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ తాజాగా దువ్వాడ శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు .వాణికి, పిల్లలకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రానివ్వనని, వారు అడిగినవి ఏవైనా ఇస్తానని, ఒక్క ఇల్లు తప్ప అంటూ దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోయే వరకు ఈ ఇంట్లోనే ఉంటాను అంటూ టెక్కలి లోని ఇంటి పైన తేల్చి చెప్పారు.
టెక్కలి నివాసం పై వాణి పట్టు.. ఏం జరుగుతుందో
ఇదే సమయంలో మాధురిది డ్రామా కాదని, డిప్రెషన్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. నాపై ట్రోల్స్ చేస్తూ మాధురిని కూడా బలి చేశారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. వాణి అడిగిన వాటిలో ఆ ఒకటి తప్ప ఏం అడిగినా ఇస్తానంటూ దువ్వాడ శ్రీనివాస్ తేల్చి చెప్పారు. అయితే వాణి మాత్రం టెక్కలిలోని ఇంటి పైన గట్టి పట్టు పడుతున్నారు. ఆ ఇల్లు తమకు, తమ పిల్లలకు రావాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. మరి ముందు ముందు ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications