జగన్ పార్టీ ఖాళీ అవుతుంది: వర్ల, దాడి వ్యాఖ్యలేనని..

కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడానికి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కారణమైతే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కారణమని దుయ్యబట్టారు.పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ నేత దాడి వీరభద్రరావు వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని అన్నారు.
రాబోయే రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అవడం ఖాయమని అన్నారు. ఇది ఇలా ఉండగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో జరిగిన భూ కేటాయింపులన్నిటినీ సమీక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖమంత్రి కెఈ కృష్ణమూర్తి తెలిపారు.
శనివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్ని పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications