లోకేష్ చదువు గురించి పదేపదే ప్రశ్నిస్తావ్ ..జగన్ ఏం చదివాడు? వర్ల రామయ్య సూటిప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారవైసీపీ , ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి, ఫిల్టర్ లేకుండా నోటికొచ్చినట్టు తిట్టుకుంటూనే ఉన్నారు. ఏ చిన్న సందర్భం దొరికినా సరే తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. నువ్వా అంటే నువ్వా అంటూ ప్రతీ దాన్ని రాజకీయ రచ్చ చేస్తున్నారు. ఇటీవల లోకేష్ చదువుపై తీవ్ర వ్యాఖ్యలతో వైసీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. టీడీపీ నాయకులు సమాధానం చెప్తున్నారు.

లోకేష్ చదువుపై సాయిరెడ్డి వ్యాఖ్యలపై వర్ల ఫైర్
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న డిమాండ్ పై సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వైసిపి నాయకులు నారా లోకేష్ చదువుపై, పరీక్షలు లోకేష్ రాయలేదని, డిగ్రీలు కొనడానికి ఫీజులు స్పాన్సర్స్ తో కట్టించారని పలుమార్లు విమర్శించారు. ఇక దీని పై మండిపడిన టీడీపీ నేత వర్ల రామయ్య విజయసాయి రెడ్డి పై రివర్స్ ఎటాక్ చేశారు.

ఏమి జన్మరా బాబు .. ఒకటి అని పది అనిపించుకుంటావ్ : వర్ల రామయ్య
విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ పై మండిపడిన వర్ల రామయ్య విజయసాయి రెడ్డి గారు మీ ఆలోచనలకు అసలు సిగ్గు లేదు.ఒకటి అని పది అనిపించుకుంటారు.ఏమి జన్మరా బాబు..మా లోకేష్ విద్యార్హతలు గురించి పదే పదే ప్రశ్నిస్తావ్.. అసలు మీ నాయకుడు ఏం చదివాడు ? ఏ విద్యాలయంలో చదివాడు? ఏ ఏ సంవత్సరంలో ఏ స్కూల్ లో చదివాడు? చివరిగా ఆయన సాధించిన డిగ్రీ ఏమిటో చెప్పగలరా అంటూ సాయిరెడ్డి పై రివర్స్ ఎటాక్ చేశారు.లోకేష్ చదువు పై ప్రశ్నిస్తున్న సమయంలో,జగన్ ఏం చదువుకున్నాడు అంటూ ఎదురు దాడికి దిగారు వర్ల రామయ్య.

లోకేష్ చదువుపై విజయసాయి ట్వీట్ ఇదే !!
వర్ల రామయ్య కు కోపం తెప్పించిన విజయసాయిరెడ్డి లోకేష్ పై తాజాగా చేసిన ట్వీట్ ఏంటంటే.. అసలు లోకేశం నిజంగానే చదువుకొని డిగ్రీ సంపాదించాడా ? సత్యం బాబాయ్ తో డొనేషన్ కట్టించి సీటు కొనుక్కున్నట్టు.. డిగ్రీలు కొనడానికి కూడా ఎవరైనా స్పాన్సర్ చేశారా? లేకపోతే అతని పేరుతో ఎవరైనా పరీక్షలు రాశారా? అతని ఐక్యూ స్థాయి చూస్తే హై స్కూల్ దాటే ఛాన్సే లేదు అంటూ విజయ సాయి రెడ్డి లోకేష్ చదువు ని టార్గెట్ చేసి విమర్శించారు.ఈ క్రమంలోనే వర్ల రామయ్య సాయి రెడ్డి పై ఎదురుదాడి చేశారు.
Recommended Video

గత కొంతకాలంగా లోకేష్ చదువుపై వైసీపీ విమర్శలు , ముందు వరుసలో విజయసాయి
ఇంతకు ముందు లోకేష్ చదువుపై మంత్రి కొడాలి నాని , విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు .లోకేష్ చదువుకు టీడీపీ మద్దతుదారులు ఫీజులు కట్టారని విమర్శించారు . తన చదువుకు కట్టిన ఫీజుల లెక్కలతో సహా అన్ని వివరాలు ఇస్తానని చెప్పి లోకేష్ వారి వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు . అయినప్పటికీ ఇంకా లోకేష్ చదువు గురించి వైసీపీ నాయుకులు పదేపదే టార్గెట్ చేస్తూనే ఉన్నారు . అందరిలో విజయసాయి లోకేష్ చదువుపై విమర్శించటంలో ముందు వరుసలో ఉన్నారు .
-
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే..












Click it and Unblock the Notifications