అమెరికా వెళ్లిన చంద్రబాబు తిరిగొస్తారు.. లండన్ వెళ్లిన జగన్ తిరిగివస్తారో రారో!!
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పై టిడిపి పోలీసు బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమీ తెలియదని, అన్నీ తెలిసినట్టుగా ఆయన బిల్డప్ ఇస్తారని వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.
కౌంటింగ్ కు వైసీపీ నేతలు భయపడుతున్నారు
వెబ్ కాస్టింగ్ ఎన్నికల సంఘం పరిశీలిస్తుందని పేర్కొన్న వర్ల రామయ్య, వెబ్ కాస్టింగ్ కు చంద్రబాబుకు ఏం సంబంధం ఉందో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీని ప్రజలు తిరస్కరించారని పేర్కొన్న ఆయన, ఆ విషయం ఆ పార్టీ నేతలకు కూడా అర్థమైంది అన్నారు. అందుకే కౌంటింగ్ రోజున ఏజెంట్లుగా వెళ్లడానికి ఎవరు ముందుకు రావడం లేదని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.

మార్పు కోసం టీడీపీకి పట్టం కట్టనున్న ఏపీ ప్రజలు
అన్ని రోజులు ఒకే విధంగా ఉండవన్న విషయాన్ని సీఎం జగన్ సహా వైసిపి నేతలు తెలుసుకోవాలని వర్ల రామయ్య సూచించారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందని పేర్కొన్న ఆయన మార్పు కోసం తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓడిపోతున్నామని తెలిసే వైసీపీ నేతలు బయటకు రావడంలేదని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.
వైసీపీ నేతలకు అంతా తెలుసు
చంద్రబాబు అమెరికా నుంచి తిరిగి వస్తారని, ఇక లండన్ వెళ్లిన సీఎం జగన్ తిరిగి వస్తారో రారో అంటూ వర్ల రామయ్య సెటైర్లు వేశారు. జగన్ లండన్ వెళ్లే సమయంలో వైసీపీకి 144 సీట్లు వస్తాయని చెప్పారట, అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి అబద్దాలు చెప్తున్నారని అనుకుంటున్నారు అంటూ వర్ల రామయ్య మండిపడ్డారు.కానీ వైసీపీ నేతలకు అసలేం జరుగుతుందో తెలుసన్నారు.
మాచర్లలో పిన్నెల్లి ఘోర పరాజయం తప్పదు
ఇక మాచర్లలో ఓడిపోతున్నామన్న భయంతోనే పిన్నెల్లి దాడులు చేశారని మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘోర పరాజయం తప్పదంటూ వర్ల రామయ్య పేర్కొన్నారు. మాచర్ల ప్రజలు స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారని, జూన్ 4వ తేదీన మాచర్ల ప్రజలకు పిన్నెల్లి సోదరుల కబంధహస్తాల నుంచి విముక్తి దొరుకుతుందని అన్నారు. మాచర్లలో నమోదైన ప్రతి కేసులోనూ పిన్నెల్లి సోదరులే ఏ1 అని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రజల దెబ్బకు వైసీపీ ఫినిష్ అంటూ వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు
-
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు











Click it and Unblock the Notifications