అసలే బాధలో ఉంటే మధ్యలో వర్మ ఒకడు .. బాబు నీతే ఫాలో అయ్యారట .. బాబు బ్రహ్మానందంలా మారాడట ..
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఉంది టీడీపీ పరిస్థితి. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా ఫలితాలొస్తే వాటిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్న చంద్రబాబుకు ఎంపీల పార్టీ ఫిరాయింపు పెద్ద షాకే ఇచ్చింది. ఇక టీడీపీలో నెలకొన్న తాజా పరిస్థితి చూసి పార్టీ శ్రేణులు భయాందోళనకు గురవుతుంటే ఇక పుండు మీద కారం చల్లినట్టు మధ్యలో రాం గోపాల్ వర్మ ట్వీట్లు , సెటైర్లు టీడీపీని మరింత ఇబ్బంది పెడుతున్నాయి.

టీడీపీ సంక్షోభంలో ఉంటే వర్మ సెటైర్లు
వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏపీ ఎన్నికల ముందే కాదు, ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం వివాదాలతో కాలం గడిపే రాంగోపాల్ వర్మ టీడీపీ అంటే, చంద్రబాబు అంటే ఒంటికాలిమీద లేస్తారు . మొన్నటి వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని పట్టుకొని చంద్రబాబు టీడీపీ ప్రభుత్వాన్ని తన ట్వీట్ లతో, తన వ్యాఖ్యలతో నానా నరకం చూపించిన రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ద్వారా చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకున్నారు. వర్మ తాజాగా చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్య చేశారు. టీడీపీని కాపాడాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలని వర్మ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు టీడీపీలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపధ్యంలో వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video


వెన్నుపోటు పొడిచి పార్టీ మారి బాబు నీతినే ఫాలో అయ్యారని ట్వీట్ చేసిన వర్మ
టీడీపీ అధినేత చంద్రబాబుపై రాం గోపాల్ వర్మ ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ విదేశాల్లో వున్నప్పుడు నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిస్తే.. ఇప్పుడు చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని వర్మ ఎద్దేవా చేశారు. దీనిని బట్టి చరిత్ర ఎప్పుడూ పునరావృతం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇక ఫిరాయించిన టీడీపీ నేతలు బాబు నీతినే ఫాలో అయ్యారని వ్యాఖ్యానించారు. మొదటి నుండీ చంద్రబాబును వెన్నుపోటుదారుడిగా మాట్లాడిన వర్మకు ఇప్పుడు టీడీపీ ఫిరాయింపు నేతల వల్ల మంచి అవకాశం దొరికింది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టయ్యింది. ఏపీ అసెంబ్లీలో బాబు గారు బ్రహ్మానందం అయిపోయారంటూ సెటైర్లు వేశారు.

అసెంబ్లీలో సీఎం జగన్ బ్రహ్మానందంలా చంద్రబాబు మాటలకు నవ్వుతున్నారన్న వర్మ
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు బ్రహ్మానందంలా కామెడీ పండిస్తున్నారని వర్మ పేర్కొన్నారు. బాబు మాట్లాడినప్పుడల్లా జగన్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. దీని అర్ధం చంద్రబాబు అసెంబ్లీలో బ్రహ్మానందంగా మారిపోయారు అని వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలే చంద్రబాబు బాధలో ఉంటే వర్మ మధ్యలో ఇలా మరింత బాధించేలా పోస్ట్ లు పెట్టి శాడిజం చూపించటం అవసరమా అని టీడీపీ అభిమానులు లబోదిబోమంటున్నారు .












Click it and Unblock the Notifications