తిరుమలలో వరుణ యాగానికి నేడే అంకురార్పణ: టీటీడీ చైర్మన్ భూమన!!
వర్షాలు లేని దేశాన్ని ఊహించుకోలేము. వర్షాలు సకాలంలో కురవకపోతే దేశంలో కరువు తాండవిస్తుంది. పాడి పంటలు లేక ప్రజలు తిండికి కూడా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ వరుణ దేవుడి కరుణ మానవాళిపై ఉంటేనే మనం పాడి పంటలతో సంతోషంగా జీవించగలము.
ఇప్పటికే దేశంలో ఎక్కడ చూసినా అకాల వర్షాలు, అతి వృష్టి, వరదలు మానవాళిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అయితే సకాలంలో వర్షాలు కురవాలని, పాడి పంటలు బాగా ఉండి పిల్లా జెల్లాతో ప్రజలంతా సుఖంగా ఉండాలని అనేకచోట్ల వరుణ యాగాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దేవదేవుడు కొలువైన తిరుమలలో కూడా వరుణ యాగం నిర్వహించి వర్షాల కోసం ప్రార్ధిస్తున్నారు.

రానున్నరెండు సంవత్సరాలలో వర్షపాతం తక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అయితే వర్షాలు సమృద్ధిగా పడితేనే పాడి, పంటలు సమృద్ధిగా ఉంటాయని, కాబట్టి వర్షాల కోసం వరుణ యాగం నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. సమృద్ధిగా వర్షాలు కురవడం కోసం తిరుమలలో వరుణ యాగం నిర్వహిస్తున్నామని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
గత నెలలో కూడా తాము వరుణయాగం నిర్వహించామని, గత నెలలో నిర్వహించిన వరుణయాగం వల్ల వర్షాలు బాగానే కురిశాయి అని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాస మంగాపురంలో శత కుండాత్మక మహా శాంతి వరుణ యాగంలో భాగంగా నేటి ఉదయం ఆచార్య రుత్విక్ వరణం నిర్వహించారు. ఈ వేడుకను అత్యంత ఘనంగా వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తో పాటు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, టిటిడి అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో నిర్వహించనున్న వరుణ యాగానికి ఈరోజు సాయంత్రం అంకురార్పణ జరగనుందని పేర్కొన్నారు. ఈ వరుణయాగం వర్షాలు సమృద్ధిగా కురిపించి మానవాళి శ్రేయస్సు కు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు .












Click it and Unblock the Notifications