వాస్తు భయంతో... రూట్ మార్చిన చంద్రబాబు, ఇప్పుడంతా రివర్స్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మళ్లీ వాస్తు భయం పట్టుకుంది. దీంతో ఆయన ఏపీ సచివాలయంలో తన రూట్ మార్చారు. గేట్ నంబర్ 1 నుంచి కాకుండా గేట్ నంబర్ 2 నుంచి చంద్రబాబు నాయుడు సచివాలయంలోకి వెళుతున్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మళ్లీ వాస్తు భయం పట్టుకుంది. దీంతో ఆయన ఏపీ సచివాలయంలో తన రూట్ మార్చారు. గేట్ నంబర్ 1 నుంచి కాకుండా గేట్ నంబర్ 2 నుంచి చంద్రబాబు నాయుడు సచివాలయంలోకి వెళుతున్నారు.
వాస్తు కారణాలతోనే సీఎం రూట్ మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఓటుకు కోట్లు కేసుతో చిక్కుల్లో పడిన సమయంలోనూ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి వాస్తుపై దృష్టి కేంద్రీకరించారు.

అందులో భాగంగా ఆయన తన రాకపోకల దారి మార్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఇంట్లో నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు కుడివైపు తిరిగేవారు. ఇప్పుడు ఎడమ వైపునకు తిరిగి రాకపోకలు సాగిస్తున్నారు.
అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కూడా వాస్తు ప్రకారం అనేక మార్పులు చేర్పులు చేయించారు.












Click it and Unblock the Notifications