గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగార్జుననే సెక్రటరియేటా, దగ్గరే రాజధానికి భూములు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

VC rules out ANU housing secretariat
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే కసరత్తు కొనసాగుతుండగానే తాత్కాలిక రాజధానికి అవసరమైన సకల సదుపాయాలతో కూడిన ఓ సువిశాల ప్రాంగణం సిద్ధమైపోయింది! పచ్చదనం, అందమైన భవన సముదాయాలు, విశ్రాంతి భవనాలు, అధునాతనమైన ఎయిర్ కండీషన్డ్ సమావేశపు మందిరాలు, సువిశాలమైన రహదారులు కలిగి గుంటూరు - విజయవాడ మధ్య ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంప్ కార్యాలయానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారట.

సుమారు 300 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నెలకొని వున్న ఈ విశ్వవిద్యాలయం సముదాయంపై ప్రస్తుతం యావత్ సీమాంధ్ర దృష్టి కేంద్రీకృతమై ఉంది. సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు క్యాంప్ కార్యాలయాన్ని ఇందులోనే ఏర్పాటు చేస్తారన్న సమాచారంతో ఇక్కడ సందడి నెలకొంది. దీనిపై జోరుగా చర్చ సాగుతోంది. వర్సిటీ ప్రాంగణంలో సిఎం తాత్కాలిక క్యాంప్ కార్యాలయానికి అవసరమైన భవనాలు మాత్రమే కాకుండా మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేసుకోడానికి అవసరమైన భవంతులు కూడా సిద్ధంగా ఉన్నాయి.

అంతేగాక హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చి రాజధాని పనులను పర్యవేక్షించే అధికారులకు అవసరమైన కార్యాలయాలతో పాటు అతిథి గృహాలు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి అవసరమైన పూర్తి అనువైన వాతావరణం ఇక్కడ ఉంది. నాలుగువైపులా ఇప్పటికే ఎత్తయిన ప్రహరీ నిర్మితమై ఉంది. దీంతో భద్రతకు ఢోకా ఉండదు. విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారంతోపాటు ఉత్తర, దక్షిణ దిక్కుల్లో మరో రెండు గేట్లు కూడా ఇప్పటికే ఏర్పాటై ఉన్నాయి. ఈ మూడు మార్గాల ద్వారా మినహా వర్సిటీ లోపలకు రావడానికి మరే ఇతర అవకాశాల్లేవు.

సమీక్షలు, సమావేశాలు నిర్వహించడానికి విశాలమైన కాన్ఫరెన్స్ హాల్స్ సిద్ధంగా ఉన్నాయి. అలాగే పిజి హాస్టల్ నూతన భవనం, దూరవిద్య కేంద్ర భవనం, విసి చాంబర్.. తదితరాలు ఉన్నాయి. గుంటూరు - విజయవాడ మధ్య మంగళగిరి సమీపంలో సుమారు 1800 ఎకరాల మిగులు భూములు ఉన్నాయని, ఈ భూములు రాజధాని నిర్మాణానికి అనువుగా ఉంటాయని ఇటీవల జిల్లా యంత్రాంగం కేంద్రం కమిటీ శివరామకృష్ణన్ బృందానికి నివేదిక సమర్పించింది.

ప్రస్తుతం సిఎం క్యాంప్ కార్యాలయంగా నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్న యూనివర్సిటీ యంత్రాంగం సిఫారసు చేసిన భూములు కేవలం 10 కిలోమీటర్ల లోపు దూరంలో మాత్రమే ఉన్నాయి.

మంగళగిరి సమీపాన ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేస్తే మంత్రులు, అధికారులు యూనివర్సిటీలో తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సౌలభ్యంగా ఉంటుంది. బహుశా ఈ ఉద్దేశంతోనే నాగార్జున విశ్వవిద్యాలయాన్ని క్యాంప్ కార్యాలయంగా నిర్ణయించారనే ప్రచారమూ జరుగుతోంది. కాగా, నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా పరిపాలన జరుగుతుందనేది కేవలం ప్రచారమేనని, అలాంటిదేమీ లేదని ఇంకొందరు చెబుతున్నారు.

English summary
With rumour mills fuelled by real estate firms going hog over Acharya Nagarjuna University status in the coming days, academicians and non-teaching staff are rallying together in decrying these rumours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X