Veerasimhareddy : జగన్ టార్గెట్ గా రెచ్చిపోయిన బాలయ్య-వైసీపీ పాలనపై హైఓల్టేజ్ డైలాగ్ వార్ !

ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ను నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి పతాకస్ధాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా ఏపీలో గత నాలుగేళ్లుగా సాగుతున్న వైసీపీ సర్కార్ పాలనను ఎండగడుతూ బాలయ్య విసిరిన పంచ్ లు అభిమానులకే కాదు, టీడీపీలో సగటు కార్యకర్తల్ని, వైసీపీ వ్యతిరేకులందరికీ పండగ చేసేలా ఉన్నాయి. ట్రైలర్ లోనే రెండు డైలాగ్స్ లో రచ్చ చేసిన బాలయ్య.. సినిమాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.

వీరసింహారెడ్డి డైలాగ్ వార్

వీరసింహారెడ్డి డైలాగ్ వార్

బాలయ్య తాజా చిత్రం వీరసింహారెడ్డి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఉదయం నుంచే థియేటర్లలో బాలయ్య అభిమానులు సందడి చేస్తున్నారు. అదే సమయంలో వీరసింహారెడ్డిలో బాలయ్య పంచ్ లు అదిరిపోతున్నాయి. వీటిని ధియేటర్లలో బాలయ్య అభిమానులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయాల నేపథ్యంలో వీరసింహారెడ్డి సినిమాలో పలు డైలాగులు పెట్టడం, వాటిని బాలయ్య తనదైన శైలిలో ప్రయోగించిన తీరు ఆకట్టుకుంటోంది. దీంతో వీరసింహారెడ్డి డైలాగ్స్ వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీకి ఉపయోగపడేలా కనిపిస్తున్నాయి.

జగన్ టార్గెట్ గా రెచ్చిపోయిన బాలయ్య

జగన్ టార్గెట్ గా రెచ్చిపోయిన బాలయ్య

ఏపీలో వైసీపీ ప్రభుత్వాధినేతగా ఉన్న వైఎస్ జగన్ ను నేరుగా టార్గెట్ చేస్తూ పలు విషయాల్లో బాలయ్య వీరసింహారెడ్డి చిత్రంలో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. గతంలో బాలయ్య నటించిన పలు చిత్రాల్లోనూ గత కాంగ్రెస్ ప్రభుత్వాలపై, వైసీపీ ప్రభుత్వంపైనా ఒకట్రెండు డైలాగులు ఉండేవి. వాటిని అప్పటి కాలమాన పరిస్ధితులు, సమస్యల ఆధారంగా బాలయ్య ప్రయోగించేవారు. కానీ ఇప్పుడు వీరసింహారెడ్డిని చూస్తుంటే వైసీపీ నాలుగేళ్ల పాలనలో చోటు చేసుకున్న పలు పరిణామాల్ని, ఏపీ ఎలా నష్టపోయిందన్న అంశాల్ని టచ్ చేస్తూ బాలయ్య డైలాగ్ వార్ సాగిపోయింది.

బాలయ్య డైలాగ్ వార్ సాగిందిలా..

బాలయ్య డైలాగ్ వార్ సాగిందిలా..


వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య డైలాగ్ వార్ చూస్తే వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు సైతం గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేసినట్లు అర్దమవుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో సాగుతున్న విధ్వంసం, దాడులు, కొత్త పరిశ్రమలు రాకపోవడం, ఉన్నవి కూడా రాష్ట్రం వీడి వెళ్లిపోవడం, ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు, తొలిసారి జగన్ అధికారంలోకి రావడం, అధికారం అండతో తీసుకుంటున్న నిర్ణయాలపై వీరసింహారెడ్డిలో పలు సీన్లలో బాలయ్య తీవ్ర పదజాలంతో పంచ్ లు విసిరారు. ముఖ్యంగా అభివృద్ధికి నిర్వచనాన్ని హోంమంత్రికి చెప్పే సీన్లో బాలయ్య పద ప్రయోగాలు, రైమింగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

అభిమానులకు పండగే..

అభిమానులకు పండగే..

బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో ప్రయోగించిన డైలాగ్స్ చూస్తుంటే ఆయన అభిమానులతో పాటు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నేతలు, విపక్ష పార్టీల నాయకుల్ని మెప్పించేలా ఉన్నాయి. వారు ఇన్నాళ్లు బహిరంగంగా చేస్తున్న విమర్శలనే బాలయ్య డైలాగ్స్ రూపంలో ఈ సినిమాలో ప్రయోగించారు. ముఖ్యంగా వైసీపీ నేతలను అసహనానికి గురిచేసేలా ఈ డైలాగ్స్ ఉన్నాయి. వైఎస్ జగన్ పేరెత్తకుండానే ఆయన ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ వరుసపెట్టి ఏకేసిన తీరు కచ్చితంగా టీడీపీ అభిమానుల్ని రంజింపచేసేలా ఉంది. ఈ సినిమాలో బాలయ్య డైలాగ్స్ పై వైసీపీ అభిమానులు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+