వెలిగొండ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు భావోద్వేగంతో ఏం చేశారంటే!

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల 30 ఏళ్ల కల నెరవేరింది. వారి సాగునీటి, తాగు నీటి కష్టాలు తీరనున్నాయి. ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్ట్ ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద నల్లమల కొండల్లోని రెండు సొరంగాల నుంచి ప్రవహించిన కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చి స్వాగతించారు.

నల్లమల కొండల్ని చీల్చుకుంటూ నల్లమల సాగర్ కు చేరుకున్న కృష్ణమ్మ

నల్లమల కొండల్ని చీల్చుకుంటూ గంటవానిపల్లె ఆక్విడెక్టు గుండా నల్లమల సాగర్‌కు చేరుకున్న కృష్ణమ్మను చూసి రైతులు, మహిళలు పులకించిపోయారు. సీఎం చంద్రబాబు నీళ్లలోకి దిగి పసుపు, కుంకుమ, చీర సమర్పించి భావోద్వేగానికి గురయ్యారు. క్రిష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేశారు. ఈ దృశ్యం చూసి సభా ప్రాంగణంలోని ప్రజలు భావోద్వేగంతో హర్షధ్వానాలు చేశారు.

Veligonda Project CM Chandrababu inaugurated and emotional on first phase of the Veligonda Project

స్థానిక రైతులు, మహిళలతోనే గేట్లు ఎత్తే బటన్ నొక్కించిన చంద్రబాబు

వెలిగొండ తొలి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, నాలుగు లక్షల మందికి తాగునీరు అందనుంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తే బటన్‌ను స్థానిక రైతులు, మహిళలతోనే నొక్కించిన చంద్రబాబు ఇది ప్రజలదని తెలియజేసేలా వారితోనే ప్రారంభోత్సవం నిర్వహించారు. గిరిజన మహిళలు లంబాడీ నృత్యంతో కృష్ణజలాలకు స్వాగతం పలికారు.

జలహారతి ఇచ్చిన అనంతరం భావోద్వేగానికి గురైన చంద్రబాబు

మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జలహారతి అనంతరం సీఎం పవిత్ర జలాలను మంత్రులు, అధికారులపై చల్లారు. జలహారతి ఇచ్చిన అనంతరం భావోద్వేగానికి గురైన చంద్రబాబు కెనాల్ ఒడ్డున కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి విడత పూర్తి చేసి నీటిని విడుదల చేసిన సందర్భంగా పైలాన్ ఆవిష్కరించారు.

ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. త్వరలో మీకోసం 1,050 ఎలక్ట్రిక్ బస్సులు!
ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. త్వరలో మీకోసం 1,050 ఎలక్ట్రిక్ బస్సులు!

వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ సాకారం

వెలిగొండ ఫీడర్ కెనాల్ ఒడ్డున ఏర్పాటు చేసిన వెలిగొండ ప్రాజెక్టు మీనియేచర్‌ను వీక్షించిన సీఎం చంద్రబాబు ఏయే ప్రాంతాలకు నీరు చేరుతుంది... ఎన్ని ఎకరాలకు సాగు నీరు అందుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల, అధికారులకు పలు సూచనలు చేశారు . మార్కాపురం ప్రాంత రైతులు, మహిళలు వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ చారిత్రక క్షణాన్ని సభా ప్రాంగణం నుంచి ఆసక్తిగా తిలకించారు. నల్లమల సాగర్‌కు కృష్ణాజలాలు చేరడంతో వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ సాకారమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+