బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హీటెక్కుతోంది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడలో సీఎం జగన్ పైన రాయి దాడి తరువాత స్థానిక టీడీపీ నేత బోండా పైన విమర్శలు మొదలయ్యాయి. బోండా ఉమ అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగింది. బోండా ఉమ సైతం తన పైన కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ ఘటన పైన వైసీపీ నేత వెల్లంపల్లి కీలక వ్యాఖ్యలు చేసారు.
బోండా ఉమామహేశ్వర రావుకు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బోండా ఉమా తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నాడని తెలిపారు.'బోండా ఉమ దొంగ చాటుగా ఎందుకు నామినేషన్ వేశారో చెప్పాలని డిమాండ్ చేసారు. శుక్రవారం రాత్రి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారన్నారు. బోండా ఉమను అరెస్ట్ చేస్తారని.. అతనికి అతనే మెసేజ్‌లు ఫార్వర్డ్ చేశారని ఆరోపించారు. బోండా ఉమ ప్రవర్తన చూస్తుంటే తప్పు చేసినట్టే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

సీఎం జగన్‌పై దాడి విషయంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వెల్లంపల్లి హెచ్చరించారు. బోండా ఉమ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారన్నారు. పోటీకి కూడా నిలబడలేని అసమర్థుడు బోండా ఉమా అంటూ మండిపడ్డారు. బోండా ఉమా వెనకాల ప్రజలు లేరన్నారు. సీఎం జగన్ బోండా ఉమ అనుచరుల దాడిపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వేముల దుర్గారావు సొంత మనిషి అని బోండా ఉమనే చెప్పారని గుర్తు చేసారు. ఇక.. సీఎం వైయస్ జగన్‌పై రాయి వేశారని.. బోండా ఉమానే ఒప్పుకున్నాడు. ఇంతకన్నా ఆధారాలు ఏమి కావాలని నిలదీసారు.
బోండా ఉమకు డిపాజిట్లు కూడా రావని వెల్లంపల్లి ఛాలెంజ్ చేసారు. మే 13న జరిగే ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ విజయ ప్రభంజనం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. ఈ నెల 22న విజయవాడ సెంట్రల్ అభ్యర్ది గా నామినేషన్ వేస్తున్నట్లు వెల్లంపల్లి వెల్లడించారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications