కృష్ణంరాజు కు వెంకయ్య - ఏపీ మంత్రుల నివాళి : రోజా ఎమోషనల్..!!

కృష్ణంరాజు పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు అర్పిస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సినీ పరిశ్రమ కు కృష్ణంరాజు మరణం తీరని లోటుగా పేర్కొన్నారు. బీజేపీ నేతగా.. కేంద్ర మంత్రిగా కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. పార్టీ నేతలు వెంకయ్య పార్దివ దేహం పైన పార్టీ జెండా కప్పి నివాళి అర్పించారు.

ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రులు

ఏపీ నుంచి మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం తరపున కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళి అర్పించారు. మంత్రులు విశ్వరూప్.. వేణు గోపాల క్రిష్ణ..కారుమూరి నాగేశ్వర రావు..మంత్రి రోజా హాజరయ్యారు. కృష్ణంరాజు మరణం బాధాకరమని చెప్పారు. మంత్రి రోజా ఎమోషనల్ అయ్యారు. సుదీర్ఘ కాలం సినీ పరిశ్రమలో కృష్ణంరాజు రారాజుగా వెలుగొందారని చెప్పుకొచ్చారు. కృష్ణంరాజు మరణించారనే విషయం తాను జీర్ణించుకోలేక పోతున్నానంటూ ఎమోషనల్ అయ్యారు. కృష్ణంరాజు సతీమణి పడుతున్న బాధ చూస్తుంటే ఆవేదన కలుగుతుందన్నారు.

మంత్రి రోజా ఎమోషనల్

మంత్రి రోజా ఎమోషనల్

ఆ కుటుంబానికి దేవుడు ధైర్యం కల్పించాలని ఆకాంక్షించారు. ఆయన మరణం సినీ..రాజకీయ రంగానికి తీరని లోటుగా పేర్కొన్నారు. మరో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తాము ఏపీ ప్రభుత్వం తరపున నివాళి అర్పిస్తున్నామని చెప్పారు. కృష్ణంరాజు వ్యక్తిగతంగా అందరితో స్నేహ పూర్వకంగా ఉండేవారని కొనియాడారు. సినీ- రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు సేవలు మర్చిపోలేమని మరో మంత్రి వేణు గోపాల క్రిష్ణ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద రాజు మాట్లాడుతూ కృష్ణంరాజు మరణం తీరని లోటన్నారు.

కృష్ణంరాజు రారాజుగానే

కృష్ణంరాజు రారాజుగానే

ఆపదలో ఉన్న ఎవరికైనా సాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి కృష్ణంరాజని నివాళి అర్పించారు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు ప్రజల మదిలో కృష్ణంరాజు నిలిచిపోతారని ప్రసాద రాజు చెప్పుకొచ్చారు. మరో మంత్రి విశ్వరూప్ .. కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళి అర్పించారు. నర్సాపురంలో ఏ గ్రామానికి వెళ్లినా ఆయన జాడలు కనిపిస్తాయన్నారు. రాజకీయాల్లో కృష్ణంరాజు హుందాగా వ్యవహరించారని కొనియాడారు. ఈ మధ్నాహ్నం కృష్ణంరాజు కు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+