సోనియా గాంధీ నా శత్రువు కాదు, మోడీని అనొచ్చు: వెంకయ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దేశంలో తనకు అసలు శత్రువులే లేరని, తాను ఓ అజాత శత్రువుని అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, ఆమె తనకు శత్రువు కాదన్నారు.

దటీజ్ వెంకయ్య: ప్లాన్ ప్రకారం నాయుడికి మోడీ కీలక బాధ్యత
బీజేపీ నుంచి వరుసగా నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికైన వెంకయ్యను బెంగళూరులోని తెలుగు సంఘాలు సత్కరించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరుసగా మూడుసార్లు తనను రాజ్యసభకు పంపిన కర్ణాటక నేతలకు, ప్రజలకు తాను రుణపడి ఉన్నానని చెప్పారు. జీవితకాలం కర్ణాటక అభివృద్ధికి తాను పాటుపడతానన్నారు.

 Venkaiah Naidu asks media to be ‘constructive’

వెంకయ్య మీడియాకు సూచనలు చేశారు. మీడియా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. సెన్షేషనల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

సమాచార ప్రసార సంబంధిత శాఖ మంత్రిగా తాను త్వరలో మీడియాతో, మీడియా యాజమాన్యంతో, సంపాదకులతో సమావేశమవుతానని చెప్పారు. ఎందుకంటే మన అందరి అజెండా అభివృద్ధి అయి ఉండాలని చెప్పారు.

ఇక చాలు కానీ!: తెలుగులో వెంకయ్య ట్వీట్, షాకిచ్చిన ఏపీ వ్యక్తి

బాధాకరమైన విషయమేమంటే ఇక్కడ అభివృద్ధి నిరోధించడం ఓ వార్త, విధ్వంసం ఓ వార్త అవుతోందని, కానీ అభివృద్ధి మాత్రం వార్త కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తన వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని చెప్పారు.

తమ ప్రభుత్వాన్ని విమర్శించవద్దనో, లేక ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించవద్దనో తాను మీడియాకు చెప్పడం లేదన్నారు. నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. అభివృద్ధి పైన కూడా మీడియా దృష్టి పెట్టాలని హితవు పలికారు. మీడియా ప్రజలకు స్పష్టంగా అన్నింటిని చెప్పాలన్నారు. మోడీ ఈ హామీ ఇచ్చారు, ఇప్పటి వరకు చేయలేదు, మోడీ ఈ హామీ ఇచ్చారు, ఇంత చేశారు.. అని ప్రజలకు చెప్పాలని మీడియాకు సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Stating that agenda of the country should be development, Union information and broadcasting minister M. Venkaiah Naidu on Sunday expressed unhappiness over “sensationalism getting prominence” over it in the news and asked media to be “constructive”.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి