వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిపై ఏం చేస్తున్నారో అర్థమౌతోందా: కాంగ్ వెంకయ్య ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: విభజన అంశంపై కాంగ్రెసు పార్టీ మీద భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు శుక్రవారం తీవ్రస్థాయిలో ఢిల్లీలో మండిపడ్డారు. తెలంగాణపై అధిష్టానం ఓ మాట చెబుతుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరో మాట చెబుతారని, ఆ పార్టీలో సమన్వయం లేదని విమర్శించారు.

కాంగ్రెసు పార్టీ అధిష్టానం విభజనపై తమ నాయకులలో సమన్వయం తీసుకు రావాలని సూచించారు. విభజనపై బిజెపి స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అన్నారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. వచ్చే ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలలో బిజెపి ఆధిక్యం కనబరుస్తుందని చెప్పారు.

Venkaiah Naidu

విభజనపై కాంగ్రెసు పార్టీ ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టి రెంటికి చెడ్డ రేవడిలా కాంగ్రెసు పార్టీ తయారయిందన్నారు.

దేశ రాజకీయాల్లో ఎపి బలమైన శక్తి: పళ్లం రాజు

దేశ రాజకీయాల్లోనే ఆంధ్రప్రదేశ్ బలమైన శక్తి అని కేంద్రమంత్రి పళ్లం రాజు హైదరాబాదులో అన్నారు. విభజన ప్రక్రియ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. విభజన అనివార్యమైతే సమన్యాయం చేయాలన్నారు. విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా తాము మంత్రుల బృందానికి నివేదిక ఇచ్చినట్లు చెప్పారు.

అడ్డుకునే ప్రయత్నం: అశోక్ బాబు

రాష్ట్ర విభజనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తామని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వేరుగా అన్నారు. శాయశక్తులా కృషి చేస్తామన్నారు. విభజన ప్రక్రియ అప్రజాస్వామికమని జాతీయ పార్టీలు అంటున్నాయన్నారు. బిల్లు వస్తే పదమూడి జిల్లాల శాసన సభ్యులు వ్యతిరేకించాలని కోరారు.

English summary
Bharatiya Janata Party senior leader Venkaiah Naidu on Friday alleged that no one know what Congress is doing on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X