వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్యకు ప్రవాసాంధ్రుల ఆహ్వానం - 5 రోజులు అక్కడే..ఇలా..!!

|
Google Oneindia TeluguNews

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత లండన్ రావాలంటూ వెంకయ్యకు ఆహ్వానం అందింది. ప్రసాస భారతీయులు.. ప్రవాసాంధ్రుల ఆహ్వానంతో వెంకయ్య సతీ సమేతంగా లండన్ వెళ్తున్నారు. అయిదు రోజుల అక్కడే ఉండనున్నారు. దాదాపుగా అయిదు దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక పదవులు నిర్వహించిన వెంకయ్య నాయుడు ఈ నెల 10వ తేదీన ఉప రాష్ట్రపతి హోదాలో పదవీ విరమణ చేసారు. తాను రాజకీయాలకు మాత్రమే దూరమయ్యానని..ప్రజా జీవితానికి కాదని వెంకయ్య స్పష్టం చేసారు.

Recommended Video

ఏపీలో కేంద్ర సంస్థల ఏర్పాటుపై వెంకయ్య నాయుడు ఫోకస్ *Andhra Pradesh | Telugu OneIndia

నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉంటానని స్పష్టం చేసారు. తాజాగా...హైదరాబాద్ కేంద్రంగా వెంకయ్యనాయుడు తో ఆత్మీయ సమావేశం జరిగింది. తనకు ఇప్పటి వరకు ఉన్న ప్రోటోకాల్ బంధనాలు తొలిగిపోయాయని.. ఇక నుంచి తాను ప్రజాజీవితంలో యాక్టివ్ అవుతానని స్పష్టం చేసారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన వారితో సత్సంబంధాలు కలిగిన వెంకయ్యకు తెలుగు రాష్ట్రాల్లో అభిమానించే వారి సంఖ్య భారీగా ఉంది. ఇప్పుడు విదేశాల్లో స్థిర పడని ప్రవాస భారతీయులు..ప్రవాసాంధ్రులు వెంకయ్యను ఆహ్వనిస్తున్నారు.

Venkaiah Naidu London tour on NRIs invitation, interact with Telugu people in UK

అందులో భాగంగా లండన్ లో ఉన్న ప్రవాస భారతీయుల ఆహ్వానం మేరకు వెంకయ్య నాయుడు లండన్ వెళ్తున్నారు. అక్కడ వెంకయ్య కు ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేసారు. సతీసమేతంగా వెళ్తున్న వెంకయ్య నాయుడు అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పూర్తిగా వ్యక్తిగత హోదాలో ఈ పర్యటన జరగనుంది. అదే సమయంలో అక్కడ ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన తెలుగు సభలు..గెట్ టు గెదర్ సమావేశాలకు హాజరవుతారని తెలుస్తోంది. అదే విధంగా అయిదు రోజుల పాటు లండన్ తో పాటుగా బ్రిటన్ లోని పలు నగరాల్లో జరిగే కార్యక్రమాల్లోలనూ పాల్గొంటారు. సెప్టెంబర్ 3న తిరిగి వెంకయ్య స్వదేశానికి రానున్నారు.

English summary
Venkaiah Naidu t ovisit London for 5 days tour up to september 3rd, NRI;s invited former vice president to UK.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X