చంద్రబాబు అరెస్ట్.. వచ్చే ఎన్నికల్లో అతనే సీఎం అన్న వేణుస్వామి

ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ఆయన చెప్పనవి చెప్పినట్టుగా జరగడంతో.. వేణు స్వామిని ఫాలో అయ్యేవారి సంఖ్య ఎక్కువైంది. నాగ చైతన్య, సమంత , నిహారిక, ఇలా పలువరు సినీ తారలు వీడిపోతారని, ప్రభాస్ ఆదిపురుష్ ఫ్లాప్ అవుతుందని.. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోతుందని ముందే చెప్పి సంచలనం సృష్టించారు.

Venu swamy reaction after chandrababu arrest who is cm in next elections

ఇక రాజకీయ నేతలపై కూడా ఆయన చెప్పినవి జరగడంతో సోషల్ మీడియాలో వేణు స్వామి పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌ తిరిగి సీఎంలు అవుతారని గతంలోనే చెప్పారాయన. తాజాగా దీనిపై మరోసారి స్పందించారాయన. వేణు స్వామి ఇటీవలే తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

Venu swamy reaction after chandrababu arrest who is cm in next elections

ఈ సందర్భంగా ఆయన్ను చుట్టుముట్టిన మీడియా.. ఏపీకి కాబోయే సీఎం ఎవరంటూ వేణు స్వామిని ప్రశ్నించారు. తాను గతంలోనే దీనిపై మాట్లాడానని..అదే జరుగుతుందని వేణుస్వామి తెలిపారు.చంద్రబాబు అరెస్ట్ అయ్యారు కదా అని అడగ్గా..ఎన్ని జరిగినా కూడా గతంలో తాను చెప్పిన వారే సీఎం అవుతారని వేణుస్వామి మరోసారి పునరుద్ఘాటించారు.

Venu swamy reaction after chandrababu arrest who is cm in next elections

అయితే పేర్లు చెప్పాలని మీడియా కోరగా.. దేవుడు సన్నిధిలో ఉన్నామని..రాజకీయల గురించి ఇక్కడ మాట్లాడం సరైంది కాదంటూ వేణుస్వామి అక్కడ నుంచి వెళ్లిపోయారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత కూడా ఏపీకి జగనే సీఎం అని వేణుస్వామి చెప్పిన మాటలను బట్టి చూస్తే అర్థం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+