అప్పుడు హామీలపై పోటీ పడ్డారు, ఇప్పుడేమో: విహెచ్

ఇచ్చిన హామీని అమలు చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు. శుక్ర వారం గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో వీహెచ్ మాట్లాడారు. సీమాంధ్రలో దాదాపు 80 వేల కోట్లు, తెలంగాణలో 20 వేల కోట్ల వరకూ రుణమాఫీ చేయడానికి బ్యాంకులు కూడా ముందుకురాని పరిస్థితి నెలకొందని చెప్పారు.
ఇప్పటికే బ్యాంకులు పెద్దమొత్తంలో రుణాలు వసూలుకాక ఇబ్బం దులను ఎదుర్కొంటున్నాయని, ఈ సమయంలో రుణాల మాీఫీకి సంబంధించి తమపై ఒత్తిడి తేవద్దని ఎస్‌బీహెచ్ బ్యాంక్ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. ఖరీఫ్ సీజన్‌లో పంటల విషయంలో రైతులు సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, చేసిన అప్పులు మాఫీ అవుతాయో లేదోనని, కొత్తగా పంట రుణాలను తీసుకోవాలంటే బ్యాంకులు ఇస్తాయోలేదోనన్న సందేహంతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు.
కేవలం ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఓటర్లను మభ్యపెట్టడానికి అమలు చేయలేని వాగ్దానాలు చేయడం సరికాదన్నారు. వక్ఫ్‌భూములు, అసైన్డ్ భూములు, సర్ఫేకాస్ భూములను పరిరక్షణ విషయంలో తెరాస ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అయ్యప్ప సొసైటీలో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇండ్లు కట్టుకోవడం అక్రమమని చెప్పి కూల్చివేతలు చేపడుతున్న ప్రభుత్వం వక్ఫ్ భూముల్లోనూ ఆకాశ హార్మ్యాలు కట్టి కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications