ప్రేమలేఖనా: కిరణ్‌పై విహెచ్, కాల్చేస్తామంటే..: పొన్నం

V Hanumantha Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తాను రాయలసీమ ఫ్యాక్షనిస్టునని నిరూపించుకుంటున్నాడని, శ్రీధర్ బాబు మంత్రి పదవికి రాజీనామా చేస్తే, దానిని ప్రేమలేఖ అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంత రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ విజయ యాత్రలో భాగంగా ఆదివారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ఆయన అక్కడ ఏర్పాటు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

చిత్తూరు జిల్లాలో జోరుగా కొనసాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ ముఖ్యమంత్రికి తెలియకుండానే జరుగుతోందా? అని ప్రశ్నించారు. దీనిపై త్వరలోనే అన్ని ఆధారాలు బయట పడే అవకాశం ఉందని, అప్పుడు కిరణ్ ఎంత అవినీతి పరుడో తేలుతుందని అన్నారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి కూడా పదవిలో ఉన్నపుడు నీతి పరుడని అనుకున్నారని, ఆ తర్వాతే ఆయన హయాంలో ఎంత దోచుకున్నదీ బయటపడిందని అన్నారు.

బిల్లు జరగకుండా కుట్ర: శ్రీధర్ బాబు

విభజనపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయానికి అయినా కట్టుబడి ఉంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్ యూ టర్న్ తీసుకోవడం విచారకరమని శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం రవీంద్ర భారతిలో తెలంగాణ అధికారులు, ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరణ్ తెలంగాణ బిల్లుకు అడ్డుపడినా పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు.

సోనియా తెలంగాణపై తీసుకునే నిర్ణయాన్ని అమలు చేస్తానని చెప్పి మాట మార్చడం కిరణ్‌కు తగదన్నారు. బిల్లుపై చర్చ జరగకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు అడ్డుపడడం, దీనికి ముఖ్యమంత్రి వంతపాడడం అప్రజాస్వామికమన్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టామని, ఇక చర్చ మాత్రమే జరగాల్సి ఉందన్నారు. తనను ఎన్నుకున్న ప్రజల అభీష్టం మేరకు తాను తెలంగాణకు కట్టుబడి ఉండి మంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగకుండా సీమాంధ్రులు కుట్ర పన్నుతున్నారన్నారు.

కేసుపై పొన్నం

చట్టాలు సీమాంధ్రులకు చుట్టాల్లాగా ఉంటే.. మనకు సుమోటో కేసులవుతున్నాయని ఎంపీ పన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలో అన్నారు. ఆత్మహత్యలు చేసుకోం.. ఆత్మాహుతి దాడులు చేస్తామని పయ్యావుల కేశవ్ అన్నారని, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు కుట్రదారులను కిరణ్ వ్యాఖ్యానించినా, కాల్చివేస్తామంటూ టిజి వెంకటేష్ హెచ్చరించినా వారిపై కేసులుండవన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+