హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సునీత హత్య: విజయారెడ్డి, జగన్నాథనాయుడు అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Viajayareddy arest in sunitha murder case
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సంచలనం సృష్టించిన సునీత అనే మహిళ హత్య కేసులో ఇద్దరు నిందితులు కల్లు విజయారెడ్డిని, జగన్నాథనాయుడిని పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఫార్మాస్యూటికల్ కంపెనీ వ్యవహారాల్లో కొట్లూరి కృష్ణపై భాగస్వామి విజయారెడ్డి కక్ష కట్టి ఆయన భార్య సునీతను హత్య చేయించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

పోలీసు స్టేషన్లలో పార్ట్‌టైమ్ రైటర్‌గా పనిచేసే జగన్నాథనాయుడు విజయారెడ్డికి సహకరిస్తూ చివరకు సునీతను హత్య చేసినట్లు పోలీసులుగు గుర్తించారు. గత నెల 16వ తేదీన కృష్ణ భార్య సునీతను జగన్నాథనాయుడు కారులో తాను ఉంటున్న అత్తాపూర్‌కు తీసుకుని వెళ్లి చిరకొంగును మెడకు చుట్టి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు.

సునీత మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి గోనెసంచీలో పెట్టి మూసీనదిలో పడేశాడు. గత నెల 18వ తేదీన తన భార్య సునీత కనిపించడం లేదని కృష్ణ అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో జగన్నాథనాయుడు సునీతను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

విజయారెడ్డి, కృష్ణ కలిసి బీబీనగర్, కొండమడుగుల్లో వికె డ్రగ్స్ పేరిట సంస్థలను స్థాపించారు. దానికి ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సాయంతో ఫైనాన్స్ కంపెనీలో కోటి రూపాయలు, బ్యాంకులో 3 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు. ఆ తర్వాత కృష్ణ, విజయారెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ విభేదాలు కక్షల స్థాయికి చేరుకుని సునీత హత్యకు దారి తీశాయి.

English summary

 Viajya Reddy and Jagannatha naidu have been arrested by police in Sunitha murder case in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X