TTD: నకిలి టిక్కెట్ల దందా, ఏంమాయ చేస్తున్నారో తెలుసా ?, పాస్ పోర్టు నెంబర్ తో !
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in
ద్వారా మాత్రమే ఆన్ లైన్ లో తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామా, ఫోన్ నెంబర్ తో టికెట్లు బుక్ చేసుకోవాలని, అక్కడంటే అక్కడ దళారులను ఆశ్రయించి తమ శ్రీవారి దర్శన టికెట్ల విషయంలో నష్టపోవద్దని టీటీడీ మరోమారు శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి చేసింది.
తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు గురువారం ఉదయం తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలోనికి ప్రవేశించారు. వీరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆ తరవాత ఆ భక్తులను విచారించగా తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు అన్నాదురై పాస్ పోర్ట్ లోని చివరి నెంబర్లు మార్చి ఆన్ లైన్ లో కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేశారని వెలుగు చూసింది.

ఆ కల్యాణోత్సవం టిక్కెట్లను శ్రీవారి భక్తులకు అధిక ధరలకు విక్రయించినట్లు ఆ భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు తెలిపారు. దీంతో సదరు వ్యక్తులపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు.
కొంతమంది దళారులు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని శ్రీవారి భక్తుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని శుక్రవారం టీటీడీ తెలిపింది.
ప్రస్తుత టీటీడీ యాజమాన్యం దళారుల ఏరివేత పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. శ్రీవారి దర్శనాల కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికావద్దని టీటీడీ మనవి చేసింది. శ్రీవారి భక్తులు పొందిన టికెట్లను, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దర్శనానికి వెళ్లే ముందు మరొకసారి పరీక్షించడం జరుగుతుంది. ఆ సమయంలో భక్తులు పొందిన టికెట్లు నకిలీగా తేలితే భక్తులు అనవసరమైన ఇబ్బందులు గురికావాల్సి వస్తుంది. శ్రీవెంకటేశ్వర
స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications