3 సినిమాలు మిక్సీలో వేసి బాగా రుబ్బితే... ఖుషి?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ, సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత జంట‌గా న‌టించిన రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ ఖుషి. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకుంటోంది. జయరాం, సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సెప్టెంబరు ఒకటోతేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.విప్లవ్(విజ‌య్ దేవ‌ర‌కొండ‌), ఆరాధ్య (సమంత) ప్రేమించుకోవడం.. దీనికి ఇరు కుటుంబాలవారు ఒప్పుకోకపోవడం..ఆ తర్వాత వీరిద్దరూ బయట పెళ్లిచేసుకోవడం.. వివాహమైన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు.. లాంటి భావోద్వేగాలతో ఫీల్ గుడ్ గా సాగింది. ప్రేమ, హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్ ను ప్రధానంగా చేసుకొని ఈ సినిమా సాగబోతోందని అర్థమవుతోంది. ఇటువంటి తరుణంలో కొత్తవాదన ఒకటి తెరపైకి వచ్చింది.

vijay devarakonda and samantha new movie kushi update

దేశముదురు, అంటే సుందరానికి, గీతగోవిందం.. ఈ మూడు సినిమాలు మిక్సీలో వేసి రుబ్బితే వచ్చిందే ఖుషి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఖుషి ట్రైలర్ లో కూడా ఈ మూడు సినిమాల షేడ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు. కాశ్మీర్ వెళ్లిన ఓ యువకుడికి ఓ ముస్లిం అమ్మాయి కనిపించటం, వెంటపడి ప్రేమించడం, ఆ త‌ర్వాత ఆ అమ్మాయి గురించి ఓ షాకింగ్ ట్విస్ట్ రివీల్ అవ్వ‌డం దేశముదురు చిత్రంలో గమనించాం.

ఒక‌రు బ్రాహ్మిణ్‌, మ‌రొక‌రు క్రిస్టియ‌న్ అవ్వ‌డం వ‌ల్ల‌.. ఇంట్లో వాళ్లు పెళ్లి ఒప్పుకోక‌పోవ‌డం వంటివి నాని సినిమా అంటే సుందరానికి గుర్తుచేసింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు.. అపార్ధాలు.. పెళ్లి ఇదంతా గీతగోవిందంలా కనిపించింది. ఈ మూడు సినిమాలను మిక్సీలో వేసి బాగా రుబ్బారని, దీంతో ఖుషి తెరపైకి వచ్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు. రెగ్యులర్ గా వచ్చే కథతోనే రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ, సమంతకు ఎలాంటి విజయాన్నిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+