ఎవడు కొనమన్నాడురా సినిమాను? నువ్వు కొని..!
విజయ్ దేవరకొండ-సమంత జంటగా నటించిన తాజా చిత్రం ఖుషి. విడుదలైన మొదటిరోజు మొదటి ఆట నుంచే ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ అందుకుంది. ఓవర్సీస్ లో మాత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది. మైత్రీమూవీస్ బ్యానర్ పై యెర్నేని నవీన్, వై.రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాకు ముందు విజయ్ నటించిన లైగర్, దానికి ముందు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు ఘోరపరాజయం పొందాయి.
2020లో విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ భారీ డిజాస్టర్ అయింది. డిస్ట్రిబ్యూటర్స్ ను ఈ సినిమా నిలువెల్లా ముంచేసింది. తాజాగా ఈ విషయాన్ని అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా గుర్తు చేశారు. అభిమానులకు కోటిరూపాయలివ్వడం చాలా మంచి విషయమని, నీ సినిమాను గతంలో డిస్ట్రిబ్యూట్ చేసి నష్టాలు చవిచూశామని, ఇప్పటివరకు దానిగురించి స్పందించలేదన్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పంపిణీలో తమకు రూ.8 కోట్ల నష్టం వచ్చిందని, దానిపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదన్నారు.

విజయ్ గారు... ఇప్పుడు మీరు పెద్ద మనసుతో కోటిరూపాయలను అభిమానుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున విరాళంగా ఇస్తుండటం బాగుందని, దయచేసి మమ్మల్ని, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలను కూడా కాపాడాలని కోరుతున్నామన్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తోంది. ప్లాప్ వచ్చిందని డబ్బులు అడుగుతున్నాడని, హిట్ వచ్చినప్పుడు డబ్బులు ఇస్తావా? ఇదే మాట ఇప్పుడున్న పెద్ద హీరోలను అడిగే దమ్ముందా? అని కొందరు.. ఎవడు కొనమన్నాడురా సినిమాను.. అర్జున్ రెడ్డి సినిమాను మరోమాట లేకుండా అంత అంటే అంతకు కొన్నారని, అప్పుడు లాభాలు చూశారని, విజయ్ ను ఆకాశానికి ఎత్తేశారని, ఇప్పుడు తన అభిమానుల కోసం ఏదో చేస్తుంటే అది చేయనీయరా? నష్టపోతే సినిమా నిర్మాతను అడగాలికానీ విజయ్ ను అడుగుతావా? అంటూ దేవరకొండ అభిమానులు ఏకిపారేస్తున్నారు.












Click it and Unblock the Notifications