వారం పాటు పని చేయండి, 35 సీట్లు మనవే: విజయ సాయి రెడ్డి

కాకినాడ మేయర్‌ పీఠాన్ని వైసిపి చేజిక్కించుకోవాలని, దీని కోసం కార్యకర్తలు అవిశ్రాంతంగా వారం రోజులు పని చేయాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సూచించారు.

కాకినాడ: కాకినాడ మేయర్‌ పీఠాన్ని వైసిపి చేజిక్కించుకోవాలని, దీని కోసం కార్యకర్తలు అవిశ్రాంతంగా వారం రోజులు పని చేయాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సూచించారు.

కాకినాడ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పద్మనాభ ఫంక్షన్‌ హాల్లో శనివారం పార్టీ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Vijaya Sai Reddy confident on Kakinada municipal corporation win

కాకినాడ ఎన్నికల్లో విజయం రానున్న సార్వత్రిక ఎన్నికలకు నాంది కావాలన్నారు. వారంపాటు విశ్రమించకుండా ప్రతి ఒక్కరు పనిచేసి వైసిపిని గెలిపించాలన్నారు. అన్ని సర్వేల్లో కాకినాడలో వైసిపి 35 సీట్లు గెలుస్తుందని తేలిందని, విజయం ఖాయమన్నారు.

ఈ నెల 29న పోలింగ్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలన్నారు. కాకినాడలోని పద్మనాభ ఫంక్షన్‌ హాలును ఎన్నికలు పూర్తయ్యే వరకూ కార్యాలయంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ్నుంచే కార్యకలాపాలు సాగించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+