సాయిరెడ్డి సంచలన ప్రకటన, టార్గెట్ ఫిక్స్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. వైసీపీ వీడి రాజకీయాల నుంచి తప్పుకున్న మాజీ ఎంపీ సాయిరెడ్డి సంచలన ప్రకటన చేసారు. బీజేపీ చేరుతారని.. తిరిగి వైసీపీలోకి వస్తారనే ప్రచారం వేళ తన భవిష్యత్ నిర్ణయం పై స్పష్టత ఇచ్చారు. గతంలోనే ఈ మేరకు సంకేతాలు వచ్చినా.. ఇప్పుడు అధికారికంగా తేల్చి చెప్పారు. కొత్త మార్గం ఎంచుకున్నారు. తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు.
వైసీపీ మాజీ నేత సాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత జగన్ కోటరీ కారణంగా తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత లిక్కర్ కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కేసిరెడ్డి అని చెప్పుకొచ్చారు. జగన్ కోటరీ నష్టం చేస్తుందని ఆరోపించారు. తాజాగా అమరావతి చట్ట బద్దత బిల్లు ఆమోదం తరువాత తన అభిప్రాయం వెల్లడించారు. రాజ్యసభలో రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ... వైసీపీ ఎంపీలు తమ అధినేతను దూషిస్తుంటే స్పందించరా అంటూ నిలదీసారు. ఇక.. సాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతున్న వేళ ఈ రోజు తన భవిష్యత్ ఆలోచనలు ఏంటో స్పష్టం చేసారు. కొంత కాలంగా సాయిరెడ్డి మీడియా రంగంలోకి ప్రవేశిస్తారనే వాదన ఉంది. ఇప్పుడు స్వయంగా సాయిరెడ్డే తాను మీడియా ఛానల్ ప్రారంభిస్తున్న ట్లు ప్రకటించారు.

రూటు మార్చిన సాయిరెడ్డి
సాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసారు. త్వరలో తాను డిజిటల్ మీడియా ప్లాట్ ఫాం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రారంభిస్తామని.. ఎవరికీ మద్దతు లేకుండా.. నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని చెప్పారు. వాస్తవాలనే చెబుతామని సాయిరెడ్డి వెల్లడించారు. ప్రజలకు గొంతుకగా.. వాస్తవ అంశాలను వివరిస్తూ సామాన్యులు, మహిళలు, యవత, రైతులు, శ్రామికులతో పాటుగా అందరి పక్షాన నిలుస్తామని చెప్పుకొచ్చారు. ఎవరికీ అనుకూలం, ప్రతికూలం కాదని.. ఏ పార్టీకి మద్దతుగా నిలవదని చెబుతూనే.. స్వతంత్రంగా తన మీడియా ప్లాట్ ఫాం ఉంటుందని స్పష్టం చేసారు. అదే విధంగా డిజిటల్ మీడియాతో పాటుగా త్వరలో శాటిలైట్ ఛానల్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. విలువలతో.. స్పష్టమైన విజన్ తో తన ఛానల్ ఉంటుందని చెప్పారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని ప్రకటించారు. దీంతో.. సాయిరెడ్డి తాజా ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications