• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రవిప్రకాష్ పై విజయ సాయి ఫైర్ ... సమాజాన్ని భ్రష్టు పట్టించిన బ్లాక్ మెయిలర్ , ప్రాసిక్యూట్ చెయ్యండి

|

టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై వరుస ట్వీట్లతో వాగ్బాణాలు సంధించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి . సమాజాన్ని భ్రష్టు పట్టించాడని తీవ్ర పదజాలంతో ఆయన రవి ప్రకాష్ పై విరుచుకుపడ్డారు. రవిప్రకాశ్ లాంటి కొందరు చీడ పరుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ట మసకబారిందంటూ ట్వీట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ట్వీట్ల వర్షం కురిపించాడు .

మెరుగైన సమాజంలో కానరాని రవి ప్రకాశ్..! 9అలిగేషన్స్ విత్ RP..!!

ఇక ఆయన రవి ప్రకాష్ పై ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ట్వీట్లు యధాతధంగా... ఆయన ఏం చెప్పారంటే..

"పరారీలో ఉన్న రవిప్రకాశ్ తనతో పాటు కొన్ని ఫైళ్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్ టాప్ తీసుకెళ్లినట్టు సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. మెరుగైన సమాజం కోసం ‘చెమటలు' కక్కిన రవిప్రకాశ్ తక్షణం పోలీసులకు లొంగి పోయి సహకరించారలని పౌర సమాజం కోరుతోంది."అని తోలి పోస్ట్ చేసిన ఆయన ఇక వరుస ట్వీట్లతో రవి ప్రకాష్ పై వస్తున్న ఆరోపణల్లో రాజకీయ కోణాన్ని ఆవిష్కరించారు. రెండో ట్వీట్ లో "శ్రీని రాజు సంస్థలో పనిచేస్తూ ఆయన తోడల్లుడు సత్యం రామలింగరాజును బ్లాక్ మెయిల్ చేసిన ఘనుడు రవిప్రకాశ్. బెయిల్ రావడానికి ముందు చికిత్స కోసం నిమ్స్ లో చేరాడు. ఆ సమయంలో ఆయన సెల్ ఫోన్లో మాట్లాడుతుండగా స్పై క్యామ్ తో రికార్డు చేయించి కోట్లు వసూలు చేశాడని చెప్తారు.

చీడపురుగు, బ్లాక్ మెయిలర్ల వల్ల మీడియా ప్రతిష్ట మసకబారిందన్న విజయసాయిరెడ్డి

మూడో ట్వీట్ లో "రవి ప్రకాశ్ లాంటి కొందరు చీడ పురుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ఠ మసకబారింది. వీళ్ల బారినుంచి మీడియా బయట పడితే మళ్లీ 1980 ల ముందు నాటి విశ్వసనీయత వస్తుంది. దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మీడియా ఆతర్వాత బ్లాక్ మెయిలర్లు,కుల పిచ్చగాండ్ల చేతికి వెళ్లింది." అని పేర్కొన్న విజయసాయి రెడ్డి నాలుగో ట్వీట్లో శివాజీ విషయాన్ని ప్రస్తావించారు. "రవిప్రకాష్‌ సృష్టించిన గరుడ పురాణం శివాజి కూడా టివీ9 కేసుల్లో ఇరుక్కున్నాడు. రవిప్రకాష్‌ తనకు కొన్ని షేర్లు అమ్మి మోసం చేశాడని ఈ బ్రోకర్ ట్రిబ్యునల్‌కు వెళ్ళాడు. దీని వెనక రవిప్రకాష్ ఉన్నాడు. TV9 బోర్డులోకి కొత్త యాజమాన్యం ప్రతినిధులు రాకుండా ఆఖరి నిమిషంలో ఆడిన నాటకం." అంటూ విరుచుకుపడ్డారు. "సినిమాల్లో వేషాలు లేక బ్రోకర్ అవతారం ఎత్తిన శివాజీ ఆదాయ మార్గాలపై దర్యాప్తు జరగాలి. అమరావతిలో భూముల కొనుగోళ్లు, హైదరాబాద్‌లో ఆస్తులు ఎలా కొన్నాడు? శివాజి గరుడ పురాణం ఒక కుట్ర. శివాజి టివి9 ఆఫీసులో ఏం చేస్తుంటాడో విచారణ జరగాలి." అంటూ శివాజీపైనే ఐదో ట్వీట్ లో ఆరోపణలు గుప్పించారు .

ఆయనేం మెరుగైన సమాజం కోసం పరివర్తన తెచ్చే ప్రవక్త కాదు అంటూ ట్వీట్ల వర్షం

విజయసాయి రెడ్డి చేసిన ఆరో ట్వీట్ లో ‘మెరుగైన సమాజం కోసం' పరివర్తన తీసుకుచ్చే ప్రవక్తలాగా చెలరేగిన రవి ప్రకాష్‌ చేయని దుర్మార్గాలు లేవు. మతాలను కించపర్చడం, కార్పోరేట్ల విబేధాల నుంచి భార్య భర్తల గొడవల వరకు టివీ స్ర్కీన్ పైకి ఎక్కించి సమాజాన్ని భ్రష్టు పట్టించాడు అంటూ ఫైర్ అయ్యారు. "కులం లేదంటూనే గజ్జిని వ్యాప్తి చేశాడు. మెరుగైన సమాజాన్ని అడ్డుకున్న ద్రోహి రవిప్రకాష్‌ బండారం ఎట్టకేలకు బయట పడింది. ఈయన బాధితులు ఒక్కొక్కరు ఇప్పుడు బయటకొస్తున్నారు. ‘కమ్మ'ని నీతులకు కాలం చెల్లింది." అంటూ ఏదో ట్వీట్ లో మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేశారు .

చంద్రబాబు ప్రయోగించిన తుప్పు పట్టిన మిస్సైళ్లలో రవిప్రకాష్‌ ఒకడు అన్న విజయసాయిరెడ్డి

ఇక ఎనిమిదవ ట్వీట్ లో చంద్రబాబు ప్రయోగించిన తుప్పు పట్టిన మిస్సైళ్లలో రవిప్రకాష్‌ ఒకడు. ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి తన మనుషుల ద్వారా నెలనెలా మామూళ్లు తీసుకున్న ఆరోపణలపై కూడా రవి ప్రకాష్‌పై దర్యాప్తు జరగాలి.ఆ చనువుతోనే స్మగ్లర్లు టివీ9 మీడియా స్కిక్కర్లు వేసిన వాహనాల్లో ఎర్రచందనం తరలించారు. లక్షల కోట్ల ఎర్ర చందనం తరలి పోవడంలో మీడియా ప్రముఖుడి పాత్ర కూడ ఉండటం దారుణమని విజయసాయి ట్వీట్ చేశారు. తీవ్రమైన వ్యాఖ్యలతో అందరూ అవాక్కయ్యేలా చేశారు విజయసాయి రెడ్డి .

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Terming TV9 CEO Ravi Prakash, who is currently courting arrest in a forgery case, as a “termite”, YSR Congress Party general secretary V Vijayasai Reddy said the former should surrender to police in order to save the media and the society at large.In a series of tweets on Thursday evening, the YSR Congress leader launched a scathing attack on Ravi Prakash. He called Ravi Prakash a "rusted missile" unleashed by TDP supremo N Chandrababu Naidu and time was ripe that his misdeeds would come into glaring public light.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more