వెనక్కు తగ్గిన సాయిరెడ్డి - సడన్ ఛేంజ్..!!

వైసీపీ మాజీ నేత విజయ సాయిరెడ్డి వెనుకడుగు వేసారు. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయం లోనే పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ గా సాయిరెడ్డి వ్యవహరించారు. ఆ సమయంలో అనేక ఆరోపణలు సాయిరెడ్డి పైన వచ్చాయి. కాగా, సాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక రష్మిలతో సాయిరెడ్డి సమావేశం సంచలనంగా మారింది. సాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ పై జగన్ చేసిన కామెంట్స్.. ప్రతిగా సాయిరెడ్డి స్పందనతో ఇక ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లుగానే ప్రచారం సాగింది. తాజాగా సాయిరెడ్డి వెనుకడుగు వేసారు. విశాఖ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

కోర్టు కేసుతో
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి భీమిలి వద్ద చేపట్టిన వివాదాస్పదన నిర్మాణాల్లో ఆసక్తి కర పరిణామాలు జరుగుతున్నాయి. అనుమతి లేకుండా భీమిలి వద్ద సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల వ్యవహారం హైకోర్టుకు చేరింది. అక్కడ సాయిరెడ్డి తన కుమార్తె నేహారెడ్డి సంస్థల పేరుతో కొందరు ప్రయివేటు వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేసారు. ఆ భూముల్లో అనుమతులు లేకుండ ప్రహారీలు నిర్మాణం చేసారు. సముద్రంలో గెడ్డ కలిసేచోట ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి వేయించారు. వీటిపై జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దఫదఫాలుగా విచారణ సాగిన ఈ కేసులో ఈ నెల 5న హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

Vijaya Sai Reddy seek permission for compound construction in Beach lands in Viskaha to as High Court orders

దరఖాస్తు
ఈ నిర్మాణాల కూల్చివేత.. వివరాలను వారంలో సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం పై అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఏర్పాటైన కమిటీ ఈ నెల 8న భీమిలి సాగర తీరం అంతా సర్వే చేశారు. ఏయే స్థలాలపై ఆరోపణలు వచ్చాయో వాటితో పాటు భీమిలి బీచ్‌ రోడ్డులో ని ఇతర ఆక్రమణలపైనా దృష్టిపెట్టారు. నివేదిక అదే రోజు తయారుచేసి కలెక్టర్‌కు సమర్పించారు. అక్కడి నుంచి అది హైకోర్టుకు చేరింది. ఈ వ్యవహారం పైన హైకోర్టులో కేసు కొనసాగుతుండటంతో సాయిరెడ్డి భీము నిపట్నం, నేరెళ్లవలస సర్వే నంబర్లు 1516, 1517, 1517/3, 1519/1, 1519/2, 1518, 1522, 1086లలో గల భూమికి ప్రహరీ గోడలు నిర్మిస్తామని, అనుమతులు ఇవ్వాలని అవ్యాన్‌ రియల్టర్స్‌ ఎల్‌ఎల్‌ పీ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీకి (ఏపీసీజెడ్‌ ఎంఏ) దరఖాస్తు చేశారు.

క్లారిటీ ఇవ్వండి
కేసు కోర్టు పరిధిలో ఉండటంతో.. సీజెడ్‌ఎంఏ అధికారులు ఈ దరఖాస్తును నిశితంగా పరిశీలన చేసారు. పది కొర్రీలతో వెనక్కి పంపించారు. దరఖాస్తు చేసిన సర్వే నంబర్లలో మొత్తం భూమి 23,700 చదరపు గజాలు ఉందని, అందులో ఏ ప్రాజెక్టు నిర్మించాలనుకుంటున్నారో స్పష్టత చేయలేదని పేర్కొన్నారు. దాని అంచె నా వ్యయం కూడా పేర్కొనలేదని అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రహరీ గోడ ఎంత విస్తీర్ణంలో (బిల్టప్‌ ఏరియా) నిర్మిస్తారో స్పష్టత లేదంటూ 'అవ్యాన్‌'కు పంపిన లేఖలో వివరించారు. ఆ భూమి అంతా పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం కావడంతో సర్వే చేయించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ భూములపై కోర్టు కేసుల వివరాలు, న్యాయస్థానం ఆదేశాలు చూపాలని స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+