అమ్మానాన్నకు పుడితే అంటావా, పచ్చకామెర్లు ఉంటే: విజయసాయిపై కొణకళ్ల, మురళీ మోహన్

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు మురళీ మోహన్, కొణకళ్ల నారాయణలు మంగళవారం నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబుపై, తమ పార్టీ ఎంపీ సుజనా చౌదరి సహా పలువురిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు.

ఎంపీ కొణకళ్ల నారాయణ మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డి రాజకీయాలను దిగజార్చేలా మాట్లాడారన్నారు. చంద్రబాబు చాలా సీనియర్ నాయకులు అన్నారు. గజదొంగ అని, ఛార్లెస్ శోభరాజ్ అని, అమ్మానాన్నకు పుడితే అని వ్యాఖ్యానించడం చాలా బాధాకరం అన్నారు. తాము హోదా కోసం ఉద్యమిస్తున్నామని, వైసీపీ కపట నాటకాలు ఆడుతోందన్నారు. సంస్కారహీనమైన భాష మాట్లాడారన్నారు.

Vijaya Sai Reddy words are not acceptable, says Murali Mohan

మురళీ మోహన్ మాట్లాడుతూ.. పచ్చకామెర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తోందన్నారు. ఆర్థిక నేరాల్లో ఏ1, ఏ2లుగా ఉన్న వారు ఏదో మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు అహర్నిషలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారని చెప్పారు. అలాంటి చంద్రబాబుకు చేతనైతే సహకరించాలని, అంతేకానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దన్నారు.

ఆర్థిక నేరాలు చేసే వారు మాట్లాడటం తప్పని చెప్పారు. పేడ ఉంటే మనం పక్కకు తప్పుకొని వెళ్తాం తప్పితే, తొక్కమని మురళీ మోహన్ అన్నారు. తాము కూడా అలాగే ఉంటున్నామన్నారు. విజయ సాయి రెడ్డి కూడా చదువుకున్న వ్యక్తి అని, అలాగే వ్యవహరించాలన్నారు. అప్పు చేసి పారిపోయే వాళ్లు ఆర్థిక నేరస్తులు అవుతారని, అప్పు చేసిన వారు కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+