Vijayasai Reddy: కొత్త రాజకీయ పార్టీపై విజయసాయిరెడ్డి ప్రకటన..!

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎట్టకేలకు కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. విజయదశమి తర్వాత పెట్టే ఈ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన వివరాలను ఇవాళ విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వెల్లడించారు. తాను కొత్తగా పెట్టే పార్టీకి సీఎం అభ్యర్ధి.. సామర్ధ్యంతో , అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపేవారు, ఏ కులమైనా సీఎం అయ్యే అర్హత ఉంటుందన్నారు. తాను నమ్మిన వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఇది చెబుతున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో బాల్ థాక్రే తరహాలో తన పార్టీకి మెంటార్ గా మాత్రమే ఉంటానన్నారు. తాను పగ్గాలు తీసుకోకుండా, సీఎం కాకుండా పార్టీని వెనకుండి నడిపిస్తానన్నారు. దేశభక్తి ఉండాలని, సామర్ధ్యం, తెలివితేటలు ఉన్న వారికే పగ్గాలు ఇస్తామన్నారు. అలాగే తాము చేసిన తప్పులకే ప్రభుత్వాలు జెన్ జీకి భయపడుతున్నాయని సాయిరెడ్డి తెలిపారు. అందుకే తాము కొత్తగా పెట్టబోయే పార్టీలో 2029 నాటికి 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారికి ఏ సీటు అయినా, ప్రభుత్వ నామినేటెడ్ సీట్లు అయినా 66 శాతం కేటాయిస్తామన్నారు. దీనికి కులాలతో కూడా సంబంధం లేదన్నారు.

టీడీపీ, వైసీపీ రాష్ట్రంలో కోటీ 50 లక్షల కుటుంబాల కోసం ఉన్నాయా లేక కుటుంబ రాజకీయాల కోసం ఉన్నాయా అని సాయిరెడ్డి ప్రశ్నించారు. అందుకే తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆశయంతో ప్రజల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. తన కొత్త రాజకీయ పార్టీకి సీఎం అభ్యర్దిగా తాను రావడం లేదన్నారు. రాష్ట్రాన్ని రెండు కుటుంబాలు మాత్రమే, రెండు రాజకీయ పార్టీలు మాత్రమే పాలించాలా అని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రెడ్లు, కమ్మ వారు మాత్రమే కాదు బీసీలు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా ఆరు కోట్ల మంది ఉన్నారని, ప్రధాన కులాల్లో రెడ్డి, కమ్మ కాకుండా కాపులున్నారని గుర్తుచేశారు. కాపులు, వెలమలు సీఎంలు కాలేదని, బీసీ వర్గాలు సీఎం కాలేదన్నారు. వాళ్లలో సామర్ధ్యం కలిగిన వారు ఉన్నా, ఈ రెండు వర్గాలు అణగదొక్కుతున్నాయని ఆరోపించారు. అందుకే తాను కొత్తగా పెట్టే పార్టీకి సీఎం అభ్యర్ధి.. సామర్ధ్యంతో , అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపేవారు, ఏ కులమైనా సీఎం అయ్యే అర్హత ఉంటుందన్నారు. తాను నమ్మిన వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఇది చెబుతున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో బాల్ థాక్రే తరహాలో తన పార్టీకి మెంటార్ గా మాత్రమే ఉంటానన్నారు. తాను పగ్గాలు తీసుకోకుండా, సీఎం కాకుండా పార్టీని వెనకుండి నడిపిస్తానన్నారు. దేశభక్తి ఉండాలని, సామర్ధ్యం, తెలివితేటలు ఉన్న వారికే పగ్గాలు ఇస్తామన్నారు.

vijayasai reddy announces details of new political party says third alternative to tdp and ysrcp

రాష్ట్రంలో ఆరు కోట్ల ప్రజలు, రాష్ట్ర సంపద ఏ పార్టీ దోచుకోవాలన్న హక్కు కోసం టీడీపీ, వైసీపీ కొట్టుకుంటున్నాయని, ఇది రాష్ట్ర ప్రజల దురదృష్టమని సాయిరెడ్డి తెలిపారు. ఈ రెండూ కుటుంబ రాజకీయ పార్టీలన్నారు. వీరిద్దరిలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఇసుక, మట్టికి, ఇళ్లు కట్టుకోవడానికి, ఆస్తుల రిజిస్ట్రేషన్ కు, ఏ అనుమతి కావాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా పోలీసులు, రాజకీయ నాయకులకు, అధికారులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లకు రౌడీ మామూళ్లు కట్టాల్సిందేనన్నారు. అలా కట్టకపోతే ఏ పనీ జరిగే పరిస్ధితి లేదన్నారు. గత ఎన్నికల్లో నేను 20 కోట్లు, 40 కోట్లు ఖర్చుపెట్టాను కాబట్టి, దాన్ని రికవర్ చేసుకుని రాబోయే ఎన్నికలకు డబ్బులు సిద్దం చేసుకోవాలని చూస్తున్నారన్నారు. కూటమి తమిళనాడు తరహా పాలిటిక్స్ ను ఇక్కడికి తెచ్చిందన్నారు. అది రాజకీయ ప్రత్యర్దులపై కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం సాధారణ విషయంగా మార్చేశారన్నారు. ఏ పార్టీ కూడా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, ప్రజల శ్రేయస్సు కోసం ముందుకెళ్తామని చెప్పడం లేదన్నారు.

ఏడాదిగా తాను ఓ పుస్తకం కోసం కృషి చేసినట్లు సాయిరెడ్డి వెల్లడించారు. రెడ్డి సామాజిక వర్గం ఎలా ఆవిర్భవించింది, రాష్ట్ర కూటులకూ వీరికీ ఏమైనా సంబంధం ఉందా, కాపుల నుంచి రెడ్డి సామాజిక వర్గం ఎలా ఉద్భవించింది, తదుపరి పరిణామాలు ఎలా ఉన్నాయన్న అంశాలతో 350 పేజీల పుస్తకం రచించినట్లు తెలిపారు. చరిత్ర కారుల నుంచీ, బ్రిటిష్ రికార్డుల నుంచీ దీనికి సమాచారం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఎడిటింగ్ లో ఉందని, ఆ తర్వాత అనువదిస్తానని తెలిపారు. తన ప్రెస్ మీట్లో ఐదు అంశాలు ప్రధానంగా ఉన్నట్లు తెలిపారు. విజయవాడతో పాటు అనంతపురం, విశాఖపట్నం, తిరుపతిలో కూడా ప్రెస్ మీట్లు కూడా పెడతానన్నారు. తన ఐదు పాయింట్లలో 80 శాతం ప్రజలకు ఖర్చు కంటే ఆదాయం తక్కువగా ఉన్నందున, దాన్ని ఎలా పెంచాలన్నది, అప్పుల ఊబి నుంచి ఎలా బయటపడాలో చెప్తామన్నారు. రెండో అంశం భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు ఎలా తగ్గించాలో చెప్తామన్నారు. అమరావతిని వ్యతిరేకించనని, ఇది ఇష్టమున్నా లేకున్నా వ్యతిరేకించి ప్రయోజనం లేదని జగన్ మావిగన్ ప్రతిపాదనపై వ్యాఖ్యానించారు. ప్రైవేటు కంపెనీల్ని ఆహ్వానించాలని, పెట్టుబడులు తీసుకురావాలని, ప్రభుత్వ డబ్బుల్ని మాత్రం అమరావతికి దుర్వినియోగం చేయొద్దన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+