ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా - విజయసాయిరెడ్డి
వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అవుతున్నట్లు ఆయన ప్రకటించారు.రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. జగన్ బాగుండాలని కోరుకుంటూనే..తాను ఏ పార్టీలో చేరటం లేదని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా తీసుకుంటున్న నిర్ణయంగా పేర్కొన్నారు. తాను భవిష్యత్‌లో వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు. శనివారం ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయడం, ఉప రాష్ట్రపతి విజయసాయిరెడ్డి రాజీనామాను ఆమోదించడం అన్నీ కూడా చక చక జరిగిపోయాయి.
I am happy to share that I have embarked on a fresh approach to my horticulture operations. pic.twitter.com/q2Gq5UNGgN
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 27, 2025
విజయసాయిరెడ్డి రాజీనామాపై పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే విజయసాయిరెడ్డి ఇంత సడన్‌గా ఎందుకు రాజీనామా చేశారనే విషయం మాత్రం తెలియడం లేదు. ఇటీవలే ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలను కూడా స్వీకరించారు.ఇలాంటి సమయంలో ఆయన జగన్‌కు తోడు ఉండాల్సిబోయి, ఇలా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటని వైసీపీ శ్రేణులు ఆయన్ను ప్రశ్నిస్తున్నాయి.

ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి చెప్పినట్టుగానే వ్యవసాయరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.తన క్షేత్రంలో వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విట్టర్‌లో షేర్ చేశారు."నా ఉద్యాన పంటల కార్యకలాపాలను తాజాగా ప్రారంభించానని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.ఓ జీప్, సింపుల్ డ్రెస్ తో వచ్చిన విజయసాయి ఆల్ ఈజ్ వెల్ అనే ఉద్దేశంతో బొటనవేలు పైకెత్తి చూపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications