చంద్రబాబు పాత అజెండాను తెరపైకి తెచ్చిన విజయసాయిరెడ్డి ?

గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత హఠాత్తుగా ఎంపీ పదవికీ, వైసీపీకీ, రాజకీయాలకే గుడ్ బై చెప్పేసిన విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఆ తర్వాత వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విషయంలో తనకు వాస్తవాలు తెలుసంటూ రంగంలోకి దిగి కొన్ని రోజులు వరుసగా వార్తల్లో నిలిచారు. అదే సమయంలో జగన్ కోటరీ పై విమర్శలు చేయడంతో పాటు తాను రాజకీయాల నుంచి తప్పుకునేందుకు వారే కారణమని చెప్పేశారు.

దీంతో వైసీపీ కూడా విజయసాయిరెడ్డిపై ఎదురుదాడికి దిగింది. ఆయనో రోగ్ ఎంపీ అని వైఎస్ జగన్ స్వయంగా విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు కోసమే సాయిరెడ్డి మూడున్నరేళ్ల గడువున్న ఎంపీ పదవిని వదులుకుని బీజేపీకి దాన్ని అప్పగించారని విమర్శలు చేశారు. అయినా తాను మాత్రం జగన్ కు విధేయుడినే అన్నట్లుగా సాయిరెడ్డి పలు సందర్భాల్లో చెబుతూనే వస్తున్నారు. అయితే ఇవాళ ఉన్నట్లుండి హిందీలో చంద్రబాబు పాత అజెండాలోని ఓ అంశాన్ని తెరపైకి తెచ్చారు.

vijayasai reddy campaigns Chandrababu s past message- here are details

ఈ మేరకు విజయసాయిరెడ్డి తన ఎక్స్ హ్యాండిల్ లో ఓ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చుక్కల రూపంలో కురుస్తున్నాయని, ఇప్పుడు ప్రతి వర్షపు నీటిని ఆదా చేయాల్సిన అవసరం ఉందని సాయిరెడ్డి ఇందులో తెలిపారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సమగ్ర జల సంరక్షణ ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. చిన్న నదులను చెరువులకు అనుసంధానించాలి, మొక్కలు నాటాలి, నది ఒడ్డున భూగర్భ జలాల రీఛార్జ్‌కు ఏర్పాట్లు చేయాలన్నారు.


నగరాల్లోని ప్రతి పెద్ద భవనంలో ఇంకుడు గుంతలను తప్పనిసరి చేయాలన్నారు. .ఇప్పుడు వర్షం మాత్రమే కాదు, నిర్వహణ కూడా ముఖ్యమని తెలిపారు. గతంలో వర్షపు నీటి నిల్వపై చంద్రబాబు తన పాత ప్రభుత్వాల్లో తీవ్రంగా ప్రచారం చేశారు. ఇన్నాళ్లకు మళ్లీ సాయిరెడ్డి అదే విషయాన్ని చంద్రబాబు పేరెత్తకుండానే ప్రచారంలోకి తెచ్చారు. అదే సమయంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి కీలక సూచన కూడా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+