సాయిరెడ్డి చంచల్‌గూడ డైరీస్, టీడీపీ పోస్ట్; బోకేష్ రాసలీలల బ్లూ డైరీస్ బయటపెట్టాలన్న వైసీపీఎంపీ

టీడీపీ అధినేత చంద్రబాబుపై, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వైసీపీ ప్లీనరీ సందర్భంగా తీవ్ర విమర్శలు చేయడంతో పాటు, టిడిపి సోషల్ మీడియాలో చేసిన పోస్టులకు సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడి చేశారు.

మళ్లీ మూడు రాజధానుల బిల్లుపెడతాం.. సీఎం సీటులో జగన్‌ మాత్రమే: ఎంపీ నందిగం సురేష్

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తధ్యం

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తధ్యం


వైసీపీ ప్లీనరీ సందర్భంగా చంద్రబాబు ని టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వైసిపి ప్లీనరీ విషయంలో ఎక్కడ అధికార దుర్వినియోగం జరగలేదని, చంద్రబాబు పిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కడ పోటీ చేసిన ఓటమి తధ్యం అని పేర్కొన్న విజయసాయిరెడ్డి, వచ్చే ఎన్నికలలో 175 స్థానాలకు, 175 స్థానాలు గెలవబోతున్నామంటూ పేర్కొన్నారు. 25 పార్లమెంట్ స్థానాలలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారంనాడు 1.68 లక్షల మంది కార్యకర్తలు ప్లీనరీకి హాజరయ్యారని పేర్కొన్న విజయసాయిరెడ్డి, శనివారంనాడు 4.5 లక్షల మందికి పైగా పార్టీ ప్రతినిధులు వస్తారని స్పష్టం చేశారు.

ఎందుకు మెంటల్ నాయుడు కుటుంబబంధాల గురించి మాట్లాడతావు?

ఎందుకు మెంటల్ నాయుడు కుటుంబబంధాల గురించి మాట్లాడతావు?


ఇక ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగాను టిడిపి పై విరుచుకు పడుతున్న విజయసాయిరెడ్డి చంద్రబాబును, లోకేష్ ను నోటికొచ్చినట్టు తిట్టిపోశారు. ఇక నిన్నటికి నిన్న బొల్లి బాబూ...ప్లీనరీ మొదలవడంతోనే నెత్తురు కక్కుకుంటున్నావు అని మండిపడిన విజయసాయిరెడ్డి, ఆదివారంవరకు ఉంటావో పోతావో? 'మన' డాక్టర్లని పిలిపించుకో అంటూ సెటైర్లు వేశారు. మెదడులో ఫ్యూజులు ఎలాగూ పోయాయి. గుండెనైనా కాపాడుకో అని వెంకటేశ్వర్లు స్పందించారు. నీ తండ్రిని ప్రేమతో నాన్నా అని పిలవగా ఎవరూ చూడలేదు. కానీ చెల్లిని తల్లిని అన్యాయం చేశాడని జగన్మోహన్ రెడ్డి పై వ్యాఖ్యలు చేయడం దేనికి అంటూ ప్రశ్నించారు. ఎందుకు మెంటల్ నాయుడు కుటుంబబంధాల గురించి మాట్లాడతావు? అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు.

ప్రాణాలు తీసే స్కెచ్ ఏదైనా వేశావా కొంపదీసి?


అంతేకాదు జే బ్రాండ్ లిక్కర్ అంటూ దాడికి దిగిన చంద్రబాబుకు విజయసాయిరెడ్డి చురకలంటించారు. 2014నాటికి 6 డిస్టిలరీలు ఉంటే, నీ ఐదేళ్ల దోపిడీ పాలనలో కొత్తగా 14 లైసెన్సులిచ్చావు అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. 254 కొత్త బ్రాండ్లకు గేట్లు ఎత్తావని చంద్రబాబును టార్గెట్ చేశారు. ఈ మూడేళ్లలో ఒక్క పర్మిషన్ కూడా తాము ఇవ్వలేదని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. విషం, కాకరకాయ అని కూస్తేవేంటి మెంటల్!ప్రాణాలు తీసే స్కెచ్ ఏదైనా వేశావా కొంపదీసి?ఉరిశిక్ష పడుతుంది జాగ్రత్త అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబు అవసరమనుకుంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని వ్యక్తి అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ రాసలీలల డైరీలు బయటపెట్టు లేకి నాయుడు: మండిపడిన సాయి రెడ్డి

ఆ రాసలీలల డైరీలు బయటపెట్టు లేకి నాయుడు: మండిపడిన సాయి రెడ్డి


ఇక తెలుగుదేశం పార్టీ చంచల్ గూడ డైరీస్ గుర్తుకొస్తున్నాయి అంటూ విజయ్ సాయి రెడ్డి ప్లీనరీ వంటలకు సంబంధించి సాంబార్ కలుపుతున్న ఒక ఫోటోను పోస్ట్ చేసి చేసిన ట్వీట్ కు విజయ సాయి రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. బోకేష్ గాడు విదేశీ భామలతో తాగి తందనాలు ఆడిన బ్లూ డైరీస్, పనిమనిషి తో చేసిన రాసలీలల డైరీలు బయట పెట్టొచ్చుగా లేకి నాయుడు అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు. బతికినంత కాలం నువ్వే సిఎం అనుకున్నావు కానీ ఇలా అవుతుందని నువ్వు ఊహించి ఉండవు అంటూ ఎద్దేవా చేశారు. మామను వెన్నుపోటు పొడిచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది నువ్వు అంటూ చంద్రబాబు ని టార్గెట్ చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి తేడా తెలియని వెర్రోడివయ్యావా? అంటూ ప్రశ్నించా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+