మళ్లీ మూడు రాజధానుల బిల్లుపెడతాం.. సీఎం సీటులో జగన్‌ మాత్రమే: ఎంపీ నందిగం సురేష్

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ప్లీనరీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ పారదర్శకత తీర్మానంపై చర్చను ప్రారంభించారు. ఈ చర్చలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ టీడీపీపై, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాజధాని పేరుతో ప్రజలను మోసం చేశారు చంద్రబాబు

రాజధాని పేరుతో ప్రజలను మోసం చేశారు చంద్రబాబు

రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని నందిగం సురేష్ మండిపడ్డారు. రైతుల భూమిని చంద్రబాబు లాక్కున్నారు అంటూ ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వందల ఎకరాలను కొల్లగొట్టారని నందిగం సురేష్ నాటి చంద్రబాబు పాలన పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు పంటలు పండే భూములను చంద్రబాబు లాక్కున్నారని ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. చంద్రబాబు తన వారికి లబ్ధి చేకూర్చడం కోసమే రాజధానిగా అమరావతిని నిర్ణయించారని నందిగం సురేష్ మండిపడ్డారు.

ఏపీ సీఎంగా జగన్ మాత్రమే... మరొకరిని ఊహించుకోలేం

ఏపీ సీఎంగా జగన్ మాత్రమే... మరొకరిని ఊహించుకోలేం

కేసుల పేరుతో రైతులను భయభ్రాంతులకు చంద్రబాబు గురిచేశారని ఆరోపించిన ఆయన, చంద్రబాబు తన పాలనా సమయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాలంటూ మండిపడ్డారు. నాడు ప్రధాని సభకు దళితులు హాజరు కాకుండా అడ్డుకున్నారంటూ విమర్శలు గుప్పించారు నందిగం సురేష్. ఇక ఇదే సమయంలో ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డిని తప్ప మరొకరిని ఊహించుకోలేము అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుష్ట శక్తులన్నీ ఏకం అవుతున్నాయని, కానీ అవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్ ను ఏమీ చేయలేవని నందిగం సురేష్ స్పష్టంచేశారు.

మళ్ళీ మూడు రాజధానుల బిల్లు పెడతాం

మళ్ళీ మూడు రాజధానుల బిల్లు పెడతాం

మూడు రాజధానులు బిల్లు మళ్ళీ ప్రవేశపెడతామని చెప్పిన ఆయన, కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు తీసుకువస్తాను అంటూ స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ తోనే రాష్ట్రం బాగు పడుతుందని ఆయన పేర్కొన్నారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని నందిగం సురేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్ విషయంలో దెబ్బతిన్నామని పేర్కొన్న ఆయన, కచ్చితంగా ఏపీలో మూడు రాజధానులు తీసుకువస్తాము అంటూ వెల్లడించారు.

ప్లీనరీలో టార్గెట్ చంద్రబాబు

ప్లీనరీలో టార్గెట్ చంద్రబాబు

ఇదే సమయంలో చంద్రబాబు పేదల చదువులు అడ్డుకోవడానికి కూడా వెనకాడడం లేదని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఎంపీ నందిగం సురేష్. పేదల చదువు అడ్డుకోవడానికి చంద్రబాబు కోర్టుకు వెళుతున్నారని, పేద పిల్లలు చదువుకుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇక వైసీపీ ప్లీనరీ వేదికగా టీడీపీపై , చంద్రబాబుపై నేతలు మూకుమ్మడిగా దాడికి దిగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+