‘పెద్ది’ని తెలంగాణలో దెబ్బ కొడుతున్న ‘మాఫియా’.. టికెట్ ధరల పెంపు లేదు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ సినిమా ఫీవర్ ఉంది. ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. మెగా పవర్ స్టార్ క్రేజ్‌కు తోడు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంతో జతకట్టడం, అలాగే మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతి బాబు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బొమన్ ఇరానీ లాంటి భారీ తారాగణం ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.

భారీ స్థాయిలో ఎదురవుతున్న సవాళ్లు

అయితే, ఈ భారీ ప్రాజెక్టును సవాళ్లు కూడా అదే స్థాయిలో చుట్టుముడుతున్నాయి. మొన్నటి వరకు థియేటర్ల పర్సెంటేజీ వివాదం చిత్ర యూనిట్‌ను కలవరపెట్టగా, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి సర్దిచెప్పడంతో ఆ సమస్య సద్దుమణిగింది. అంతా ఊపిరి పీల్చుకునే లోపే, ఇప్పుడు సరికొత్తగా టికెట్ ధరల వ్యవహారం తెరపైకి వచ్చింది. 'పెద్ది' చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్కడ రూట్ క్లియర్ అయింది. కానీ, తెలంగాణలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. కనీసం వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాతలు రెండు సార్లు తెలంగాణ హోమ్ సెక్రటరీకి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ, అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Peddi Faces Setback in Telangana as Ticket Price Hike Approval Remains Elusive

కోర్టు కూడా స్పందించలేదు

టికెట్ ధరల పెంపు రాకుండా థియేటర్ల మాఫియా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లాంటివి తెరవెనక రాజకీయం చేస్తున్నాయని రామ్ చరణ్ అభిమానులు ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడంతో నిర్మాతలు చివరకు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, టికెట్ ధరలపై గతంలో ఉన్న తీర్పులను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కూడా ఈ పిటిషన్‌పై పెద్దగా స్పందించలేదు. దీంతో వేరే దారి లేక నిర్మాతలు తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. చిత్ర యూనిట్ ఇలా వెనక్కి తగ్గడంతో తెలంగాణలో 'పెద్ది' సినిమాకు టికెట్ రేట్ల పెంపు లేనట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. టాలీవుడ్ మార్కెట్‌లో అత్యంత కీలకమైన నైజాం ఏరియాలో 'పెద్ది' లాంటి భారీ బడ్జెట్ చిత్రానికి టికెట్ ధరలు పెరగకపోవడంవల్ల సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+